Showing posts with label పరిశుద్ధం. Show all posts
Showing posts with label పరిశుద్ధం. Show all posts

Wednesday, August 23, 2017

ఓ సూర్యదేవా ఓ మహాదేవా సర్వము నీవే

ఓ సూర్యదేవా ఓ మహాదేవా సర్వము నీవే
ఓ సూర్యతేజా ఓ మహాతేజా నిత్యము నీవే

పూజ్యోదయమై సూర్యోదయమై ఉదయిస్తున్నావు
పూర్ణోదయమై సర్వోదయమై విస్తరించేస్తున్నావు
పూర్వోదయమై స్వర్ణోదయమై ప్రయాణిస్తున్నావు   || ఓ సూర్యదేవా ||

విశ్వమున నీవు లేనిచో జీవమే లేదని అణువైనను శ్వాసతో ఉండదని భావించావులే

నీవు ఉదయించుటలో అనంత పుష్పములచే సుగంధాలను వెదజల్లుతున్నాను
నీవు విస్తరించుటలో సర్వ ప్రకృతి పర్యావరణాన్ని పరిశుద్ధంగా మార్చుతున్నాను
నీవు ప్రయాణించుటలో నిత్య జగతి స్వభావాలను పరిశోధనతో ఓదార్చుతున్నాను  || ఓ సూర్యదేవా ||

విశ్వమున నీవు లేనిచో మేధస్సుకు ఉత్తేజమే లేదని కార్యాలకే తెలిసేలా స్మరించావులే

అనంత జీవులకు సర్వము నీవే సమ భావాలతో సమర్పిస్తున్నావు
అనంత రూపాలకు సర్వము నీవే సమ తత్వాలతో సహకరిస్తున్నావు
అనంత దేహాలకు సర్వము నీవే సమ బంధాలతో సందర్శిస్తున్నావు   || ఓ సూర్యదేవా || 

Thursday, May 4, 2017

ఏనాటిదో నీ రూపం ఏనాటిదో నీ దేహం

ఏనాటిదో నీ రూపం ఏనాటిదో నీ దేహం
ఏనాటికి చెదరని బెదరని భావ స్వభావం

ఎక్కడి నుండి వచ్చావో ఎక్కడి దాక ఉంటావో
ఎవరికి తెలియని మహానుభావుడివై ఉన్నావో   || ఏనాటిదో ||

పరమాత్మ నీలోనే పరిశుద్ధం నీలోనే
పరిశోధన నీలోనే ప్రజ్ఞానం నీలోనే

విజ్ఞానం నీతోనే వైభోగం నీతోనే
వేదాంతం నీతోనే విశ్వాసం నీతోనే

ప్రతి జీవికి నీవే పరబ్రంహవై ప్రత్యక్షమైనావు   || ఏనాటిదో ||

ప్రకృతిలో ఉన్నావో పరిశోధనలో ఉన్నావో
పరవశమై ఉన్నావో ప్రభాతములో ఉన్నావో

ఎక్కడైనా నీ ధ్యాసే ఎక్కడున్నా నీ శ్వాసే
ఎక్కడైనా నీ ప్రయాసే ఎక్కడున్నా నీ ఉచ్చ్వాసే

ప్రతి జీవిలో నీవే విశ్వ జగమై లీనమైనావు   || ఏనాటిదో ||

Thursday, April 13, 2017

ఏ దేహమో నీది ఏ రూపమో నీది

ఏ దేహమో నీది ఏ రూపమో నీది
ఏ దైవమో నీది ఏ ఆకారమో నీది

సత్యానికే నిత్యమై మాటకే మౌనమై వెలసినావు జీవుల రూపాలలో   || ఏ దేహమో ||

ప్రతి రూపంలో పరిశోధనగా ప్రతి ఆకారంలో పరిశీలనగా
ప్రతి దేహంలో పర్యవేక్షణగా ప్రతి దైవంలో పరిశుద్ధంగా
పరిపూర్ణమై ప్రజ్ఞానంతో ప్రకారమై జగతిలో జీవిస్తున్నావు   || ఏ దేహమో ||

ప్రతి స్వరములో సంఘర్షణగా ప్రతి శ్వాసలో సంకీర్తనగా
ప్రతి ధ్యాసలో ధీరముగా ప్రతి ధ్యానంలో మహా దివ్యంగా
స్వర విజ్ఞాన సంపూర్ణ స్వయంభువమై విశ్వంలో వెలిసావు   || ఏ దేహమో || 

Monday, September 19, 2016

సాయీ! ఒక చెయ్యి వేయుము

సాయీ! ఒక చెయ్యి వేయుము
నాలోని భారాన్ని తగ్గిస్తూ నన్నే మార్చుము  
కర్తగా కర్మగా క్రియగా నేనే దిగ్భ్రాంతితో ఇమిడిపోయి ఉన్నాను
మహా విజయంతో నాలోని అపారమైన ప్రజ్వల శక్తిని పెంచుము || సాయీ! ||

కర్తగా ఏది జరిగినా కర్మగా సాగుతూనే వెంటాడుతున్నది
క్రియా విశేషణము ఎంతటిదైనా గుణమే మారిపోతున్నది

ఆదుకుంటావని మౌనంతో నీ హృదయాన్ని చేరుకుంటున్నా
అలమటిస్తావని నాలోని భావాలనే నీకు తెలుపుకుంటున్నా   || సాయీ! ||

చేసే పనిలో నీ చెయ్యి వేసి సాయంతో నన్నే గట్టెక్కించుము
సాగే కార్యంలో కర్తవ్యాన్ని మేమే సాహసంతో అధిగమించెదము

నాలోని శక్తిని విశ్వానికి విజ్ఞానంగా పరిశుద్ధంగా అందించెదము
నాలోని భక్తిని నీ విశ్వానికి పరిపూర్ణంతో సంపూర్ణంగా ఇచ్చెదము || సాయీ! ||