ఏనాటిదో నీ రూపం ఏనాటిదో నీ దేహం
ఏనాటికి చెదరని బెదరని భావ స్వభావం
ఎక్కడి నుండి వచ్చావో ఎక్కడి దాక ఉంటావో
ఎవరికి తెలియని మహానుభావుడివై ఉన్నావో || ఏనాటిదో ||
పరమాత్మ నీలోనే పరిశుద్ధం నీలోనే
పరిశోధన నీలోనే ప్రజ్ఞానం నీలోనే
విజ్ఞానం నీతోనే వైభోగం నీతోనే
వేదాంతం నీతోనే విశ్వాసం నీతోనే
ప్రతి జీవికి నీవే పరబ్రంహవై ప్రత్యక్షమైనావు || ఏనాటిదో ||
ప్రకృతిలో ఉన్నావో పరిశోధనలో ఉన్నావో
పరవశమై ఉన్నావో ప్రభాతములో ఉన్నావో
ఎక్కడైనా నీ ధ్యాసే ఎక్కడున్నా నీ శ్వాసే
ఎక్కడైనా నీ ప్రయాసే ఎక్కడున్నా నీ ఉచ్చ్వాసే
ప్రతి జీవిలో నీవే విశ్వ జగమై లీనమైనావు || ఏనాటిదో ||

No comments:
Post a Comment