Thursday, May 25, 2017

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను
భావమే ఒక కార్యమై మేధస్సునే నడిపించేను

మనలో ఎన్ని కార్య భావాల ఆలోచనలు సాగినా
మేధస్సులో అంతరంగ స్వత భావాలు దాగేను  

విజ్ఞానము మేధస్సులో ఆలోచనగా లేకున్నను
భావనగా దేహములో అంతర్భావమే కొనసాగేను   || ఆలోచన ||

ఏనాడు నా శ్వాసపై స్వధ్యాస ఉంచకున్నను 
నా మేధస్సే హృదయ క్రియలను సాగించేను

ఏనాడు నా స్వభావాలపై సమయాలోచన చేయకున్నను
నా మేధస్సే ఆలోచనలతో ఎన్నో కార్యాలను జరిపించేను  || ఆలోచన ||

ఏనాడు నా అంతర్భావాలను గమనించకున్నను
నా మేధస్సే అంతర్లీనమై దేహాన్ని సమకూర్చేను

ఏనాడు నా దేహాన్ని స్వతహాగ ఓదార్చకున్నను
నా మేధస్సే నన్ను మహా గొప్పగా మైమరిపించేను  || ఆలోచన ||

No comments:

Post a Comment