Showing posts with label భావాలు. Show all posts
Showing posts with label భావాలు. Show all posts

Friday, June 30, 2017

అనగా అనగా నేడే వినగా వినగా

అనగా అనగా నేడే వినగా వినగా
ఒక రోజు ఏదో కథగా తెలిసేనే

అనగా అనగా ఎప్పుడో వినగా వినగా
ఏదో ఒక రోజు మన జీవితంగా మారేనే   || అనగా ||

కథలే కాలంగా జీవితమే కోరికల ప్రయాణమై సాగంగా
కలలే కాలంగా కథలే స్వభావాల మార్గమై కొనసాగంగా

ఊహలు ఎన్నో తీరని ఆశల కథలుగా సాగేనే
కలలు ఎన్నో నెరవేరని భావాల కథలుగా సాగేనే  

వింటున్నా కథనాలన్నీ కంటికే రూపమై తెలిసేనా
జీవించే జీవితాలన్నీ మేధస్సుకే ఆకారమై తెలిపేనా || అనగా ||

జీవితాలే కథలుగా నేర్చుకునే పాఠాలుగా వస్తూనే తెలిసేను ఎన్నో తీరికగా
కథలే జీవితాలుగా మార్చుకునే కళలుగా వెళ్తూనే తెలిపేను ఎన్నో ఓపికగా

కథలన్నీ విజ్ఞానంగా సాగేలా జీవితాలను గర్వంగా మళ్లించగా
కలలన్నీ కారణంగా సాగేలా జీవితాలను గొప్పగా మార్చంగా

కలలు కథలు ఊహలు జీవితాలు ఒకటై సాగేనా
భావాలు స్వభావాలు తత్వాలు కోరికలు ఒకటై సాగేనా   || అనగా || 

Thursday, May 25, 2017

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను
భావమే ఒక కార్యమై మేధస్సునే నడిపించేను

మనలో ఎన్ని కార్య భావాల ఆలోచనలు సాగినా
మేధస్సులో అంతరంగ స్వత భావాలు దాగేను  

విజ్ఞానము మేధస్సులో ఆలోచనగా లేకున్నను
భావనగా దేహములో అంతర్భావమే కొనసాగేను   || ఆలోచన ||

ఏనాడు నా శ్వాసపై స్వధ్యాస ఉంచకున్నను 
నా మేధస్సే హృదయ క్రియలను సాగించేను

ఏనాడు నా స్వభావాలపై సమయాలోచన చేయకున్నను
నా మేధస్సే ఆలోచనలతో ఎన్నో కార్యాలను జరిపించేను  || ఆలోచన ||

ఏనాడు నా అంతర్భావాలను గమనించకున్నను
నా మేధస్సే అంతర్లీనమై దేహాన్ని సమకూర్చేను

ఏనాడు నా దేహాన్ని స్వతహాగ ఓదార్చకున్నను
నా మేధస్సే నన్ను మహా గొప్పగా మైమరిపించేను  || ఆలోచన ||

Thursday, April 20, 2017

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే
జగతికే తెలియని ఊహలు ఎన్నో మేధస్సులలోనే ఆగిపోయెనే

ఎవరికి తెలియని జీవ భావాలు ఆలోచనలలోనే నిలిచిపోయెనే
ఎవరికి తెలియని దేహ తత్వాలు మనస్సులలోనే ఉండిపోయెనే  || చరిత్రకే ||

ఎవరి జీవితం వారికే తెలియునని
ఎవరి సుఖ దుఃఖాలు వారికే చెందునని
ఎవరి మనస్సులో వారే ఒదిగిపోయేనని
ఎవరి మేధస్సులో వారే ఉండిపోయేనని
చరిత్రగా ఎవరికి వారే నిలిచిపోయేనని
గతంలో జరిగిన మహా కథనాలే చరిత్రగా మారేనని
భవిష్య కాల చరిత్రాలే మహా పరిశోధన ప్రజ్ఞానమని  || చరిత్రకే ||

చరిత్రలో ఎన్నో కథనాలు జరిగిపోయేనని
కథలు కథలుగా కలలెన్నో కలిసిపోయేనని
జీవుల స్వభావ తత్వాలు ఎన్నెన్నో చెప్పేనని
కాలమే పురాణాలుగా సాగుతూ మనతో వచ్చేనని
ఎన్నో గొప్ప ఆలోచనలు మహా కార్యాలుగా సాగేనని
మన చరిత్ర నిర్మాణాలు సంపుటాలుగా భోదించేనని
అనుభవాలకే చరిత్ర పరిశోధనలు విజ్ఞానమయ్యేనని  || చరిత్రకే || 

Friday, September 23, 2016

నాలో విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే నన్ను వేధిస్తున్నది

నాలో విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే నన్ను వేధిస్తున్నది
ఆలోచనలో ఎరుకే ఉన్నా విజ్ఞానాన్ని మరిపిస్తున్నది

ఏకాగ్రతతో జీవిస్తున్నా క్షణ కాలంలో అజ్ఞానం వరిస్తున్నది
మతి మరుపే నాలో ప్రతి రోజు అజ్ఞానాన్ని వెంబడిస్తున్నది  || నాలో విజ్ఞానం ||

జీవితంతో సతమతమౌతూనే ఎన్నో సమస్యలతో నాలోనే నేను క్షీణిస్తున్నాను
జీవనంతో తడబడిపోతూనే ఎన్నో కార్యాలతో ఉద్రిక్తతకు గురి అవుతున్నాను

మేధస్సులో మహా గొప్ప భావాలున్నా అజ్ఞానమే అధికమౌతున్నది
మనస్సులో మహా గొప్ప స్వభావాలున్నా మరుపే కలుగుతున్నది   || నాలో విజ్ఞానం ||

నిత్యం ధ్యాసతోనే ఉన్నా ధ్యానిస్తునే ఉన్నా కార్యాలతో అజ్ఞానమే
నిత్యం ఎరుకతో ఉన్నా మెలకువతోనే ఉన్నా కార్యాలలో అనర్థమే

ఏనాటికి అజ్ఞానం వదిలిపోతుందో మరణ కాలమే సంభవిస్తున్నది
ఏనాటికి మరుపు విడిపోతుందో మరణమే నన్ను సమీపిస్తున్నది    || నాలో విజ్ఞానం || 

Wednesday, August 31, 2016

ప్రేమంటే తెలిసేనే మనస్సంటే తెలిసేనా

ప్రేమంటే తెలిసేనే మనస్సంటే తెలిసేనా
ప్రేమించాలని నీలో భావమే నేడు కలిగేనా   || ప్రేమంటే ||

ప్రేమంటే భావన కలిగేనా నీ మనస్సులో తెలియకనే
ప్రేమంటే తెలియకనే నీ మనస్సులో మొదలాయనే

ప్రేమిస్తే మనస్సులో ఏదో తెలియని ఆర్ద్రత కలిగేనా
ప్రేమిస్తే మేధస్సులో ఏదో తెలియని ఆతృత పుట్టేనా

ప్రేమలో భావాలు ఎన్నో ప్రేమించే స్వభావాలు మరెన్నో
ప్రేమలో కలిగే భావాలలో మంచిని తెలిపే స్వభావాలెన్నో  || ప్రేమంటే ||

ప్రేమతో సాగే స్నేహం పెళ్లితో కొనసాగడమే జీవితం
ప్రేమతో సాగే జీవితం కలసి మెలసిపోవడమే జీవనం

ప్రేమతో కలిగే అనురాగం మరో ప్రేమను పంచే జననం
ప్రేమతో కలిగే ఆప్యాయత మరో ప్రేమకు స్ఫూర్తి గమనం

ప్రేమలో కలతలు ఎన్ని కలిగినా అనుకువతో అర్థాలను గ్రహిస్తేనే పరమార్థం
ప్రేమలో లోపాలు ఎన్నున్నా ఒదిగిపోవడమే మన ప్రేమను తెలిపే గౌరవార్థం || ప్రేమంటే ||

Monday, July 18, 2016

కాలంతో సాగే కవితలు ఎన్నో

కాలంతో సాగే కవితలు ఎన్నో
కవితలుగా సాగే భావాలు ఎన్నో
కాలంతో సాగే కవితలలో కవి విజ్ఞాన భావాలు ఏవో ఎన్నెన్నో  || కాలంతో ||

కవితలుగా తెలిపే భావాలలో విజ్ఞానమే ముఖ్యాంశం
విజ్ఞానంతో సాగే కవితలలో ప్రముఖ జ్ఞానమే వేదాంశం

విజ్ఞానంతో లేని కవితలు ఏనాటికైనా చెదిరిపోయేనులే
భావాలోచన లేని కవిత్వాలు ఎప్పటికైనా చెల్లాచెదురులే  || కాలంతో ||

విజ్ఞానంతో కూడిన భావ కవితలనే విశ్వానికి అందించు
జ్ఞానంతో సాగే ఆలోచన భావాలనే ప్రపంచానికి విస్తరించు

కవితలతోనే కవి హృదయం మౌనమై కాలంతో సాగిపోయేనే
భావాలతోనే కవి మేధస్సు అమరమై వేదంతో వెళ్ళిపోయేనే   || కాలంతో ||