ప్రేమంటే తెలిసేనే మనస్సంటే తెలిసేనా
ప్రేమించాలని నీలో భావమే నేడు కలిగేనా || ప్రేమంటే ||
ప్రేమంటే భావన కలిగేనా నీ మనస్సులో తెలియకనే
ప్రేమంటే తెలియకనే నీ మనస్సులో మొదలాయనే
ప్రేమిస్తే మనస్సులో ఏదో తెలియని ఆర్ద్రత కలిగేనా
ప్రేమిస్తే మేధస్సులో ఏదో తెలియని ఆతృత పుట్టేనా
ప్రేమలో భావాలు ఎన్నో ప్రేమించే స్వభావాలు మరెన్నో
ప్రేమలో కలిగే భావాలలో మంచిని తెలిపే స్వభావాలెన్నో || ప్రేమంటే ||
ప్రేమతో సాగే స్నేహం పెళ్లితో కొనసాగడమే జీవితం
ప్రేమతో సాగే జీవితం కలసి మెలసిపోవడమే జీవనం
ప్రేమతో కలిగే అనురాగం మరో ప్రేమను పంచే జననం
ప్రేమతో కలిగే ఆప్యాయత మరో ప్రేమకు స్ఫూర్తి గమనం
ప్రేమలో కలతలు ఎన్ని కలిగినా అనుకువతో అర్థాలను గ్రహిస్తేనే పరమార్థం
ప్రేమలో లోపాలు ఎన్నున్నా ఒదిగిపోవడమే మన ప్రేమను తెలిపే గౌరవార్థం || ప్రేమంటే ||

No comments:
Post a Comment