మరచిపోయే భావాలతో జ్ఞాపకాలు శూన్యమాయే
విడిచిపోయే బంధాలతో గుర్తులన్నీ చెదిరిపోయే || మరచిపోయే ||
విజ్ఞానంతో సాగని ఆలోచనల తీరులో మతి మరుపు చేరిపోయేనే
బంధాలతో సాగని ఎన్నో పరిచయాలు స్నేహాన్ని వదిలిపోయేనే
మరుపు వదలని జ్ఞానం మనిషినే మార్చే అజ్ఞాన వేద సిద్ధాంతాలు
స్నేహానికి దూరమైపోయే జీవితాలు ఒంటరిగా సాగే జీవన విధానాలు || మరచిపోయే ||
సహాయం లేని హృదయ జీవితం ప్రోత్సాహం లేని జీవనం
ఎదుగుదల లేని విజ్ఞానం ఎవరికి తెలియని మరో ప్రజ్ఞానం
కాలంతో నేర్చుకుంటూ నెమరువేసుకునే ఆలోచనలే విజ్ఞాన జ్ఞాపకాలు
అనుభవంతో తెలుసుకుంటూ పరిశోధిస్తే విజ్ఞానమే మరవలేని సోపానాలు || మరచిపోయే ||

No comments:
Post a Comment