Tuesday, August 16, 2016

జగతికి పరమార్థమై ఉన్నావా పరమాత్మ

జగతికి పరమార్థమై ఉన్నావా పరమాత్మ
విశ్వానికి అర్థానివై సూచిస్తున్నావా మహాత్మ
ప్రకృతికి యదార్థమై తెలుపుతున్నావా మహా ఆత్మ  || జగతికి ||

సృష్టిలో నీవే జీవమై ప్రకృతిలో దేహమై ఒదిగిపోయావు
దేహంలో శ్వాసవై ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో జీవిస్తున్నావు
విశ్వ భావాలతో మహా వేద తత్వమై జగతిలో లీనమైపోయావు

అజ్ఞాన అర్థముతో విజ్ఞాన మార్గాన్ని పరమార్థముగా గ్రహించవలె
అజ్ఞానాన్ని వదులుకొని నవ విజ్ఞానాన్ని అన్వేషిస్తూ సాగిపోవాలి
అజ్ఞాన భావాలు చంచల తత్వంతో కలుగుతూ విజ్ఞానాన్ని మరిపిస్తాయి  || జగతికి ||

సత్యాన్ని సూచించే దైవం జగతిలో అంతరించిపోతున్నది
ధర్మాన్ని రక్షించే వేదం విశ్వంలో కనుమరుగైపోతున్నది
విజ్ఞానాన్ని తెలిపే మహా జ్ఞానం సృష్టిలో వదిలిపోతున్నది

పరమాత్మగా ఎదిగిపోయే స్వరూపంలోనే వేదార్థం గోచరిస్తున్నది
మహాత్మగా నిలిచిపోయే రూపంలోనే పరమార్థం అన్వేషిస్తున్నది
ఆత్మగా సాగిపోయే జీవంలోనే మహా భావ తత్వం వికసిస్తున్నది    || జగతికి || 

No comments:

Post a Comment