Showing posts with label మరుపు. Show all posts
Showing posts with label మరుపు. Show all posts

Tuesday, October 25, 2016

నీవు ప్రేమించే వరకు నేను నీ ధ్యాసతోనే ఉంటానులే

నీవు ప్రేమించే వరకు నేను నీ ధ్యాసతోనే ఉంటానులే
నీవు ప్రేమిస్తున్నావని తెలిసే వరకు నీతోనే వస్తానులే
నీవు నేను ఒకటైతే నీతో నిత్యం తోడుగానే జీవిస్తానులే  || నీవు ప్రేమించే ||

ప్రేమించే నీ భావనే నాకు ఆనందమైన శుభోదయం
ప్రేమించే నీ తత్వమే నాకు మరవలేని నవోదయం
ప్రేమించే నీ గుణమే నాకు మరుపురాని తేజోదయం

నీ ప్రేమకై నేనే జీవిస్తున్నా ఒక యుగమై వేచివున్నా
నీ ప్రేమకై నేనే వచ్చేస్తున్నా ఒక క్షణమై నిలిచివున్నా
నీ ప్రేమకై నేనే విహరిస్తున్నా ఒక కాలమై వెంటవున్నా  || నీవు ప్రేమించే ||

ప్రేమతో సాగే కాలం ఇద్దరికే తెలియని సాగే సమయం
ప్రేమతో కలిగే భావం ఇద్దరికే తెలియని కలిగే తపనం
ప్రేమతో వెలిగే తేజం ఇద్దరికే తెలియని వెలిగే సహనం

నీ ప్రేమతో నన్ను పలకరించవా నీతో నేనే పులకరించనా
నీ ప్రేమతో నన్ను పిలుచుకోవా నీతో నేనే మలుచుకోనా
నీ ప్రేమతో నన్ను చూసుకోవా నీతో నేనే మనస్సిచ్చుకోనా  || నీవు ప్రేమించే ||

Friday, September 23, 2016

నాలో విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే నన్ను వేధిస్తున్నది

నాలో విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే నన్ను వేధిస్తున్నది
ఆలోచనలో ఎరుకే ఉన్నా విజ్ఞానాన్ని మరిపిస్తున్నది

ఏకాగ్రతతో జీవిస్తున్నా క్షణ కాలంలో అజ్ఞానం వరిస్తున్నది
మతి మరుపే నాలో ప్రతి రోజు అజ్ఞానాన్ని వెంబడిస్తున్నది  || నాలో విజ్ఞానం ||

జీవితంతో సతమతమౌతూనే ఎన్నో సమస్యలతో నాలోనే నేను క్షీణిస్తున్నాను
జీవనంతో తడబడిపోతూనే ఎన్నో కార్యాలతో ఉద్రిక్తతకు గురి అవుతున్నాను

మేధస్సులో మహా గొప్ప భావాలున్నా అజ్ఞానమే అధికమౌతున్నది
మనస్సులో మహా గొప్ప స్వభావాలున్నా మరుపే కలుగుతున్నది   || నాలో విజ్ఞానం ||

నిత్యం ధ్యాసతోనే ఉన్నా ధ్యానిస్తునే ఉన్నా కార్యాలతో అజ్ఞానమే
నిత్యం ఎరుకతో ఉన్నా మెలకువతోనే ఉన్నా కార్యాలలో అనర్థమే

ఏనాటికి అజ్ఞానం వదిలిపోతుందో మరణ కాలమే సంభవిస్తున్నది
ఏనాటికి మరుపు విడిపోతుందో మరణమే నన్ను సమీపిస్తున్నది    || నాలో విజ్ఞానం || 

Friday, September 16, 2016

పరంధామా! పర బ్రంహ పర దేవో మహేశ్వరః

పరంధామా! పర బ్రంహ పర దేవో మహేశ్వరః
పట్టాభిరామ పర విష్ణు పర లోక దేవో సర్వేశ్వరః
పర తత్వ పర జ్ఞాన పర జీవ దేవో లోకేశ్వరః        || పరంధామా! ||

నాలో అపార అఙ్ఞానాన్నే వదిలించమని ప్రార్థిస్తున్నా
నాలో మతి మరుపునే తొలగించమని వేడుకుంటున్నా

విశ్వ విజ్ఞానం ఉన్నా అజ్ఞానంతో నా జీవితం వృధాగా సాగుతున్నది
వేదాల వేదాంతం ఉన్నా మతి మరుపుతో నా జీవనం తటస్థమైనది   || పరంధామా! ||

వయసై పోతున్నా ఎదుగుదల లేక నాలో నేనే శూన్యమై అణిగిపోతున్నా
కాలం సాగుతున్నా విజయం లేక నాలో నేనే నిర్జీవమై నశించిపోతున్నా

ఏనాటికి ప్రతిఫలం లభిస్తుందో నాలో ఓపిక తరుగుతున్నది
ఏనాడు ఫలితం కలుగుతుందో నాలో జీవం కరిగిపోతున్నది  || పరంధామా! ||

Wednesday, August 31, 2016

కలే కన్నానని మెలకువ తెలిపేనే

కలే కన్నానని మెలకువ తెలిపేనే
నిజమే కాదని ఉదయంతో తోచేనే
ఎన్నెన్నో కలలు కంటూనే నిద్రిస్తున్నానులే
కలలన్నీ కలలుగానే మిగిలి పోతున్నాయిలే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్నదని మరో ఊహ కలగా సాగుతున్నదిలే
కలే జీవితమని ఊహలతోనే కాలం మరుపుతో సాగేనులే

కల నిజం కాదని తెలిసినా ఊహతో ప్రయత్నమే మొదలాయనే
కల సాధ్యం కాదని తెలిసినా ఓర్పుతో సాధన ఆరంభమయ్యేనే

కలను అందుకోవాలని మనస్సులో కోరిక పుట్టేనే
కలను జయించాలని మేధస్సులో ఆలోచన తట్టేనే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్న వేళ మదిలో సంతోషమే కలిగేనే
కలే నిజమౌతున్న వేళ యదలో ఆనందమే ఉప్పొంగేనే

అన్నీ కలలు తీరవు అన్నీ కలలు మనకు గుర్తుగా ఉండవు
అన్నీ కలలు మంచివి కావు అన్నీ కలలు ఒకటిగా ఉండవు

ఆలోచిస్తేనే భావంతో కల ఎటువంటిదో తెలిసేను  
ఊహతో నెమరువేస్తేనే కల ఏమని అర్థమయ్యేను  || కలే కన్నానని ||