పరంధామా! పర బ్రంహ పర దేవో మహేశ్వరః
పట్టాభిరామ పర విష్ణు పర లోక దేవో సర్వేశ్వరః
పర తత్వ పర జ్ఞాన పర జీవ దేవో లోకేశ్వరః || పరంధామా! ||
నాలో అపార అఙ్ఞానాన్నే వదిలించమని ప్రార్థిస్తున్నా
నాలో మతి మరుపునే తొలగించమని వేడుకుంటున్నా
విశ్వ విజ్ఞానం ఉన్నా అజ్ఞానంతో నా జీవితం వృధాగా సాగుతున్నది
వేదాల వేదాంతం ఉన్నా మతి మరుపుతో నా జీవనం తటస్థమైనది || పరంధామా! ||
వయసై పోతున్నా ఎదుగుదల లేక నాలో నేనే శూన్యమై అణిగిపోతున్నా
కాలం సాగుతున్నా విజయం లేక నాలో నేనే నిర్జీవమై నశించిపోతున్నా
ఏనాటికి ప్రతిఫలం లభిస్తుందో నాలో ఓపిక తరుగుతున్నది
ఏనాడు ఫలితం కలుగుతుందో నాలో జీవం కరిగిపోతున్నది || పరంధామా! ||

No comments:
Post a Comment