ఆహా! గాలిలో గమ్మత్తైన మైకమో
ఓహో! మేఘంలో ఆశ్చర్య వర్ణమో
మేఘాల గాలి సవ్వడిలో ఎదో నవ భావమో కలిగే మనలో మహా సంతోషము || ఆహా! ||
వీచే చల్లని గాలి తీరు మేధస్సునే మెప్పిస్తూ హుషారునే కలిగిస్తున్నది
ఆకాశంలో మేఘాల తీరు ఎన్నో వర్ణాల ఆకార రూపాలతో మెరుస్తున్నది
మెల్ల మెల్లగా వీచే మత్తైన గాలి మనస్సుకే హాయిని గలిగిస్తూ సాగుతున్నది
సూర్య కిరణాల తేజస్సుతో ఆకాశ వర్ణమే మారి అద్భుతాన్ని చూపిస్తున్నది || ఆహా! ||
చల్లని గాలి గంధర్వ లోకాల నుండి సుగంధమై వీస్తున్నదేమో
మేఘాలే మహా పర్వతాల నుండి సువర్ణమై మెరుస్తున్నాయేమో
మేఘాల గాలికి మనలోని జీవమే మహా కొత్త ఉచ్ఛ్వాస నిచ్చ్వాసాలతో సాగేనే
మేఘాల వర్ణాలకు మేధస్సులో మహా ఉత్తేజమే ఉప్పొంగి దేహమే చలించేనే || ఆహా! ||

No comments:
Post a Comment