ఓ ధూమ శకటమా!
దూసుకెళ్ళే దమ్మున్న ధైర్యమా
పట్టాలపైననే దూర ప్రయాణమా
ఎదురుగా ఎవరున్నా అడ్డుగా ఏది ఉన్నా
నీకు ఏమి కాదని భారంగా దూసుకెళ్ళడమేనా || ఓ ధూమ శకటమా! ||
కాలంతో ఎన్నో వెయ్యి మైళ్ళ దూర ప్రయాణం అలసట లేని ఇంధన శక్తి సాహసమా
ప్రతి రోజు ఎందరో నీతో ప్రయాణమే చేసినా వారి గమ్యాన్ని చేర్చడమే నీ కర్తవ్యమా
గదులెన్నో చేర్చుకొని ఎందరికో వసతి కల్పించి ప్రయాణాన్ని హాయిగా సాగించేవు
ప్రయాణికులు యాత్రికులు ఎందరున్నా నీకు భారమే కానట్లు సుఖంగా సాగేదవు || ఓ ధూమ శకటమా! ||
ప్రపంచానికే నీవే చాలా పొడవైన మహా భారమైన ధూమ శకటం
పేదలకు ధనికులకు ఏ ప్రజలకైనా నీవు సరిపోయే మహా శకటం
పగలు రాత్రి సెలవులే లేనట్లు ప్రతి రోజు నీ ప్రయాణానికి నా వందనం
బంధువులు శత్రువులు స్నేహితులు ఎవరైనా నీతోనే సాగాలి ప్రయాణం || ఓ ధూమ శకటమా! ||

No comments:
Post a Comment