ఉన్నావయ్యా నీవు మాలోనే ఉన్నావయ్యా
ఉంటావయ్యా నీవు మాతోనే ఉంటావయ్యా
ఎన్నాళ్ళైనా ఏనాటికైనా నీవు మావాడివయ్యా || ఉన్నావయ్యా ||
శ్వాసలో ధ్యాసవై ఊపిరిలో ఉచ్చ్వాస నిచ్చ్వాసవై ఉంటావులే
ధ్యానంలో దైవమై దేహంలో జీవమై మహా ప్రాణంగా ఉంటావులే
పరంధామగా పరమాత్మగా మా వెంటే వచ్చెదవు
మహాత్మగా మహర్షిగా మాలోనే ఉండి పోయెదవు || ఉన్నావయ్యా ||
మాధవుడై మా మనస్సులో మహా భావాలతో దాగేవు
మహాత్ముడై మా మేధస్సులో మహా జ్ఞానాన్నే ఇచ్చేవు
హృదయంలో వెలసిన రూపం నీలాంటి ఆకాశాన్నే సూచిస్తున్నది
మదిలో కొలువైన ఆకారం నీలాగే సూర్యోదయమై వెలుగుతున్నది || ఉన్నావయ్యా ||

No comments:
Post a Comment