నీవు నేను ఒకటే అన్న భావన లేదా ... (ప్రభూ)
నేను నీవు ఒకటే అన్న ఆలోచన లేదా ... (గురూ)
నీవే నేను అన్న అర్థమైనను లేదా ... (దేవా) || నీవు నేను ||
నేను అన్న అహం ఆనాటి పగటికే చెందునని
నేను అన్న ఇహం ఈనాటి రోజులకే చేరునని
ఇహ పర లోక భావ తత్వాలు పరంపరలలోనే సాగునని తెలిసేనా
నీవే నేను అన్న అర్థ భావ తత్వాలు ఏ విజ్ఞాన గ్రంథంలో లిఖించబడలేదా
నేనే నీవు అన్న ఆత్మ పరమార్ధ తత్వములు ఏ మహాత్మునిచే తెలుపబడలేదా || నీవు నేను ||
ఏ భావ తత్వాలు ఎప్పుడు ఎవరికి కలుగునని తెలిసేనా
ఏ జీవ తత్వములు ఎప్పుడు ఎవరికి తోచేనని తెలిసేనా
ఏ విశ్వ తత్వాలు ఎప్పుడు ఎవరికి చేరునని తెలిసేనా
ఏనాటి అర్థాల భావ తత్వములో పర బ్రంహ జ్ఞానముచే తెలుపబడునా
ఏనాటి అర్థాల స్వభావాలోచనలో పర విష్ణు విజ్ఞానముచే తెలియబడునా
ఒకటే అర్థమైన పరమార్థం ఒకటేనని ఒకరిగా ఒకరికే నేడు తెలియునా || నీవు నేను ||

No comments:
Post a Comment