ప్రేమతో పలికిన మనస్సుతో పిలిచిన వచ్చేస్తానే నేను నీకోసం
భావంతో తలిచిన మౌనంతో తపించిన చేరేస్తానే నేను నీకోసం || ప్రేమతో ||
హృదయంలోని గమనమే నీ ప్రేమ తలుపుల పదనిసలు
దేహంలోని మధుర గమకమే నీ తేనే పెదవుల సరిగమలు
ప్రకృతిలో విరిసిన పుష్పాలన్నీ సుమగంధమై నిన్నే చేరేనే
ఆకాశంలో కనిపించే వర్ణాలన్నీ సువర్ణమై నిన్నే ఆవరించేనే || ప్రేమతో ||
సూర్యోదయం నీకోసమే ఉదయించేలా ప్రతి రోజు అనిపించేనే
శుభోదయం నీకోసమే స్మరించేలా ప్రతి నిమిషం అనుకున్నానే
ఎక్కడ వెళ్ళినా నీ హృదయ భావన నన్నే చేరేనులే
ఎక్కడ చూసినా నీ దేహ బంధం నన్నే తలచేనులే || ప్రేమతో ||

No comments:
Post a Comment