ఏనాటి ఋషివో నీవు ఏనాటికి కనిపించని బ్రంహగా నీలోనే మిగిలిపోయావు
ఏనాటి మహాత్మవో నీవు ఏనాటికి తెలియని మహర్షిగా కనిపించలేకపోయావు || ఏనాటి ఋషివో ||
పరంధామగా పరమాత్మవలే పర ధ్యాసలో ఉండిపోయావా
బ్రంహర్షిగా పర బ్రంహ వలే పర ధ్యానంలో నిండిపోయావా
విశ్వ పరంపరలలో ఏ పొరలలో ఎలా దాగి ఉన్నావో తెలుసుకోలేకపోయానే
సకల జీవరాసుల జగతిలో ఎలా ఏ జీవిలో లీనమయ్యావో తెలియకపోయనే || ఏనాటి ఋషివో ||
ఋషిగా అధిరోహించిన మహర్షి బ్రంహర్షివి నీవే కదా
ఆత్మగా అవతరించిన అవధూత మహాత్మవు నీవే కదా
మహాత్మ విశ్వమంతా విధేయతతో నీ రాకకై ఎదురు చూస్తున్నది
ఓ పరమాత్మ జగమంతా వినయంతో నీ రాకకై తపిస్తూనే ఉన్నది || ఏనాటి ఋషివో ||

No comments:
Post a Comment