శ్రీ చక్రాధరా నీ ఆభరణములే మా అలంకారములు
శ్రీ శంఖాధరా నీ స్వరములే మా సంగీత కావ్యములు
నీవు వెలిసిన సప్త గిరులే మహా క్షేత్ర పుణ్య తీర్థములు
నీవు నిలిచిన స్థానములే మహా దైవ పూజ్య పునస్కారాలు
నిత్యం నీ దేహానికి పూజార్చనములు పుష్పములు పాద స్పర్శములు
నిరంతరం నీకు సేవ సన్నిధములు నూతన వస్త్ర భావ కళ్యాణములు || శ్రీ చక్రాధరా ||
నీకై విరిసిన పారిజాతములచే పుష్పాభిషేకములు
నీకై పండిన ధాన్య ఫలములచే ఫలాభిషేకములు
మెలకువతో ఉంటావని నీకు నిత్య సుప్రభాతములు
సమూహముతో కదిలి వచ్చే జనానికి నీ వర భాగ్యములు || శ్రీ చక్రాధరా ||
నీ ఐశ్వర్యములు ఏడు కొండలుగా దాగిన మహా గోపుర రాసులు
నీ అన్నదానములు ఎన్ని తరములైనను నిత్యం ప్రసాదములు
నీ దర్శనముకై వచ్చే కాలి నడకల భక్తులు అలసిన బంధములు
నీ రూప ఛాయముచే భక్తులలో కలిగేను మహా మహా ఆనందములు
తరతరాలుగా వచ్చి చేరేను నీకై భక్తుల ముడుపులు కానుకలు
తరతరాలుగా కొన సాగేను నీ మహిమల మహా భావ చరిత్రములు || శ్రీ చక్రాధరా ||

No comments:
Post a Comment