పరిచయం చేసుకో స్నేహమే తెలుసుకో
స్నేహమే బంధాలై సంబంధాలుగా మారిపోవునే
బంధాలతో కొత్త పరిచయాల స్నేహం పెరిగిపోవునే || పరిచయం ||
కుటుంబాల బంధాలలో స్నేహమే జీవమై జీవించునే
సంబంధాల స్నేహాలతో కొత్త జీవితాలు పరిచయమవునే
స్నేహంలో స్వార్థం లేనట్లు సహాయాన్ని తిరిగి పంచేసుకో
స్నేహమే అనర్థం కానట్లు స్వార్థాన్ని వదిలి అర్థం చేసుకో
అందరితో కలిసిపోయి పరమార్థాన్నే సహాయంతో చాటుకో || పరిచయం ||
స్నేహంతో జీవితం ఆనందమై సాగిపోతూ మాటలతో కాలం హాయిగా గడిచిపోవునే
కార్యాలెన్నో ఒకరికి ఒకరై సులువుగా చేసుకుంటే సమస్యలే లేనట్లుగా తీరిపోవునే
మనలో మనకు మనస్పర్ధాలు వద్దని హెచ్చు తగ్గులు చూసుకోవద్దు
మనలో మనకు మహా చైతన్యం ఉందని గొప్పలు అతిగా చెప్పుకోవద్దు
మనలో మనకు కష్టాలైనా నష్టాలైనా దుఃఖాలైనా పదే పదే తలుచుకోవద్దు
మనలో మనమే స్నేహమై బంధాలుగా పరిచయాల పలకరింపులతో సాగేదమా || పరిచయం ||

No comments:
Post a Comment