Showing posts with label ఉద్రిక్తత. Show all posts
Showing posts with label ఉద్రిక్తత. Show all posts

Friday, September 23, 2016

నాలో విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే నన్ను వేధిస్తున్నది

నాలో విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే నన్ను వేధిస్తున్నది
ఆలోచనలో ఎరుకే ఉన్నా విజ్ఞానాన్ని మరిపిస్తున్నది

ఏకాగ్రతతో జీవిస్తున్నా క్షణ కాలంలో అజ్ఞానం వరిస్తున్నది
మతి మరుపే నాలో ప్రతి రోజు అజ్ఞానాన్ని వెంబడిస్తున్నది  || నాలో విజ్ఞానం ||

జీవితంతో సతమతమౌతూనే ఎన్నో సమస్యలతో నాలోనే నేను క్షీణిస్తున్నాను
జీవనంతో తడబడిపోతూనే ఎన్నో కార్యాలతో ఉద్రిక్తతకు గురి అవుతున్నాను

మేధస్సులో మహా గొప్ప భావాలున్నా అజ్ఞానమే అధికమౌతున్నది
మనస్సులో మహా గొప్ప స్వభావాలున్నా మరుపే కలుగుతున్నది   || నాలో విజ్ఞానం ||

నిత్యం ధ్యాసతోనే ఉన్నా ధ్యానిస్తునే ఉన్నా కార్యాలతో అజ్ఞానమే
నిత్యం ఎరుకతో ఉన్నా మెలకువతోనే ఉన్నా కార్యాలలో అనర్థమే

ఏనాటికి అజ్ఞానం వదిలిపోతుందో మరణ కాలమే సంభవిస్తున్నది
ఏనాటికి మరుపు విడిపోతుందో మరణమే నన్ను సమీపిస్తున్నది    || నాలో విజ్ఞానం ||