Showing posts with label స్వధ్యాస. Show all posts
Showing posts with label స్వధ్యాస. Show all posts

Tuesday, June 27, 2017

విశ్వమే శ్వాసగా వేదమే ధ్యాసగా

విశ్వమే శ్వాసగా వేదమే ధ్యాసగా
జగమే జీవంగా విజ్ఞానమే ధ్యానంగా

స్వరమే సత్యంగా రాగమే ధర్మంగా
దైవమే దేహంగా గాత్రమే ప్రాణంగా

మేధస్సులో కలిగే భావాలకు ఆలోచనలో అనుభవాలు
మదిలో కలిగే మోహములకు మనస్సులో మధురములు   || విశ్వమే ||

జీవమై ఏ రూపం ఉన్నా శ్వాసగా ప్రాణం జీవిస్తున్నదే
భావమై ఏ జ్ఞానం ఉన్నా ధ్యాసగా మోహం తపిస్తున్నదే

స్వరములో తపనం ఉన్నా మౌనం మహోన్నతమైనదే
జీవములో అదరం ఉన్నా ప్రాణం అభియోగ్యతమైనదే   || విశ్వమే ||

విజ్ఞానం ఎవరితో ఉన్నా స్వధ్యాసతో సత్యమైనదే
వేదాంతం ఎవరిలో ఉన్నా  ధ్యానంతో నిత్యమైనదే

ధర్మం ఎక్కడ ఉన్నా దైవం అన్వేషిస్తున్నదే
జీవం ఎక్కడ ఉన్నా రూపం ఆవహిస్తున్నదే      || విశ్వమే || 

Thursday, May 25, 2017

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను
భావమే ఒక కార్యమై మేధస్సునే నడిపించేను

మనలో ఎన్ని కార్య భావాల ఆలోచనలు సాగినా
మేధస్సులో అంతరంగ స్వత భావాలు దాగేను  

విజ్ఞానము మేధస్సులో ఆలోచనగా లేకున్నను
భావనగా దేహములో అంతర్భావమే కొనసాగేను   || ఆలోచన ||

ఏనాడు నా శ్వాసపై స్వధ్యాస ఉంచకున్నను 
నా మేధస్సే హృదయ క్రియలను సాగించేను

ఏనాడు నా స్వభావాలపై సమయాలోచన చేయకున్నను
నా మేధస్సే ఆలోచనలతో ఎన్నో కార్యాలను జరిపించేను  || ఆలోచన ||

ఏనాడు నా అంతర్భావాలను గమనించకున్నను
నా మేధస్సే అంతర్లీనమై దేహాన్ని సమకూర్చేను

ఏనాడు నా దేహాన్ని స్వతహాగ ఓదార్చకున్నను
నా మేధస్సే నన్ను మహా గొప్పగా మైమరిపించేను  || ఆలోచన ||

Tuesday, January 3, 2017

ఏ జీవి ఎటువంటి జీవితాన్ని సాగిస్తున్నదో

ఏ జీవి ఎటువంటి జీవితాన్ని సాగిస్తున్నదో
ఏ మనిషి ఏనాటి జీవితాన్ని సాగిస్తున్నాడో
స్వధ్యాస జీవుల జీవితాలకే ఒక మహా పరీక్ష   || ఏ జీవి ||

కొన్ని జీవులు నీటిలో జీవిస్తున్నా పరలోకాన్ని చూడలేవు
కొన్ని జీవులు గాలిలో జీవిస్తున్నా మరోలోకాన్ని తలచలేవు

ఎన్నో జీవరాసులు ఈదుతున్నా నిత్యం నడవలేవు
ఎన్నో జీవరాసులు ఎగురుతున్నా నిత్యం నడవలేవు

ఎన్నో జీవరాసులు ప్రాకుతున్నా ఎప్పటికి ఎగరలేవు
ఎన్నో జీవరాసులు గెంతుతున్నా ఎప్పటికి ఎగరలేవు    || ఏ జీవి ||

మానవ జీవులు తమ భావాల పరిశోధన విజ్ఞానంతో ఎన్నో రకాలుగా ప్రయాణించెదరు
మానవ జీవుల సాంకేతిక ప్రజ్ఞానంతో ఎన్నో రకాల యంత్రాల ద్వారా ప్రయాణించెదరు

ఇతర జీవరాసులన్నీ తమ జీవితాలను ప్రాథమిక ప్రకృతి సహజత్వముతో ప్రతి కార్యాన్ని సాగిస్తాయి
ఎలాంటి ఆహారమైన వసతి ఐనా ప్రయాణమైనా రోగమైనా సహజత్వ జీవన విధానాన్నే సాగిస్తాయి

మానవుని జీవితాలు వైవిధ్యమైన యాంత్రిక విజ్ఞాన విధానాల సమస్యలతో ముడిపడి ఉన్నాయి
జీవరాసుల జీవితాలు ప్రకృతి స్వభావ సహజత్వంతో జీవన విధాన కార్యాలు ముడిపడి ఉన్నాయి  || ఏ జీవి ||