Showing posts with label తత్వాలు. Show all posts
Showing posts with label తత్వాలు. Show all posts

Friday, May 5, 2017

శ్వాసలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస తత్వాలే ధ్యాసగా మేధస్సులో ఊపిరి భావాలతో ఉన్నాయా

శ్వాసలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస తత్వాలే ధ్యాసగా మేధస్సులో ఊపిరి భావాలతో ఉన్నాయా
మేధస్సులో ఆలోచనల భావ స్వభావాలే పరధ్యాసగా మహా వేదాల తత్వాలతో ఉన్నాయా  || శ్వాసలో ||

ప్రతి క్షణం ప్రతి సమయం జీవిత కాలమంతా జీవుల దేహాలలో జీవమై ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు శ్వాసతో ఉన్నాయా
ప్రతి ధ్యాస ప్రతి ప్రయాస జీవన ప్రమాణమంతా జీవుల రూపాలలో దైవమై పర భావ స్వభావ తత్వాలతో ఉన్నాయా  || శ్వాసలో ||

శ్వాసలో పరమాత్మమే పరిశోధనగా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస భావాలు జంటగా తపిస్తున్నాయా
మేధస్సులో పరధ్యానమే పర్యవేక్షణగా ఆలోచనల వేద స్వభావ తత్వాలు జ్వలిస్తున్నాయా  || శ్వాసలో || 

Thursday, April 20, 2017

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే

చరిత్రకే తెలియని జీవితాలు ఎన్నో మనలోనే ఉండిపోయెనే
జగతికే తెలియని ఊహలు ఎన్నో మేధస్సులలోనే ఆగిపోయెనే

ఎవరికి తెలియని జీవ భావాలు ఆలోచనలలోనే నిలిచిపోయెనే
ఎవరికి తెలియని దేహ తత్వాలు మనస్సులలోనే ఉండిపోయెనే  || చరిత్రకే ||

ఎవరి జీవితం వారికే తెలియునని
ఎవరి సుఖ దుఃఖాలు వారికే చెందునని
ఎవరి మనస్సులో వారే ఒదిగిపోయేనని
ఎవరి మేధస్సులో వారే ఉండిపోయేనని
చరిత్రగా ఎవరికి వారే నిలిచిపోయేనని
గతంలో జరిగిన మహా కథనాలే చరిత్రగా మారేనని
భవిష్య కాల చరిత్రాలే మహా పరిశోధన ప్రజ్ఞానమని  || చరిత్రకే ||

చరిత్రలో ఎన్నో కథనాలు జరిగిపోయేనని
కథలు కథలుగా కలలెన్నో కలిసిపోయేనని
జీవుల స్వభావ తత్వాలు ఎన్నెన్నో చెప్పేనని
కాలమే పురాణాలుగా సాగుతూ మనతో వచ్చేనని
ఎన్నో గొప్ప ఆలోచనలు మహా కార్యాలుగా సాగేనని
మన చరిత్ర నిర్మాణాలు సంపుటాలుగా భోదించేనని
అనుభవాలకే చరిత్ర పరిశోధనలు విజ్ఞానమయ్యేనని  || చరిత్రకే || 

Thursday, January 19, 2017

మోహమో భావమో ... జీవమో దేహమో

మోహమో భావమో ... జీవమో దేహమో
నాదమో వేదమో ... రూపమో తత్వమో
సర్వ భావ తత్వాలు దేహ రూప జీవమే  || మోహమో ||

స్వర నాదాలు పలుకగా వేద నాడులు తొలికేనులే
జీవ దేహాలు కదలగా మోహ భావాలు వలచేనులే

నాద వేదాలు శృతించగా స్వప్త స్వరాలు జ్వలించేనులే
భావ బంధాలు స్మరించగా రూప తత్వాలు ప్రకాశించేనులే  || మోహమో ||

సితారా కాంతులు తపించగా సువర్ణ వర్ణాలు మెరిసేనులే
దివ్య వర్ణాలు ఉదయించగా మహా తేజస్సులే మురిసేనులే

వర్ణ రూపాలు కనిపించగా మోహ భావాలు మెప్పించేనులే
దేహ జీవాలు చలించగా విజ్ఞాన వేదాలు విశ్వసించేనులే  || మోహమో ||