Showing posts with label సంపూర్ణం. Show all posts
Showing posts with label సంపూర్ణం. Show all posts

Tuesday, March 14, 2017

శ్వాసతో జీవించే ఉచ్చ్వాసలో పరమాత్మమే

శ్వాసతో జీవించే ఉచ్చ్వాసలో పరమాత్మమే
శ్వాసతో ఉదయించే ఉచ్చ్వాస పర ఆత్మమే

శ్వాసలో మరణించు నిచ్చ్వాస పరధ్యానమే
శ్వాసలో అస్తమించు నిచ్చ్వాసతో పరభావమే

ప్రతి శ్వాస ఉచ్చ్వాస నిచ్చ్వాసతో సాగే పరమార్థం పర ధ్యాన పరమాత్మమే  || శ్వాసతో ||

శ్వాసలో సంపూర్ణం ఉచ్చ్వాస నిచ్చ్వాస కలయికల అమరత్వమే
శ్వాసలో పరిపూర్ణం ఉచ్చ్వాస నిచ్చ్వాస కలయికల సంయోగమే

శ్వాసతో సాగే ఉచ్చ్వాస నిచ్చ్వాస సంగమమే సంయోగ సంభోగము
శ్వాసతో సాగే ఉచ్చ్వాస నిచ్చ్వాస సంగమమే పరిపూర్ణ సంపూర్ణము  || శ్వాసతో ||

శ్వాసలో దాగిన ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పరిశుద్ధతయే ఆరోగ్యము
శ్వాసలో దాగిన ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పవిత్రతయే ఆనందము

శ్వాసతో సాగే ఉచ్చ్వాస నిచ్చ్వాసాల భావత్వమే స్వర ధ్యానము
శ్వాసతో సాగే ఉచ్చ్వాస నిచ్చ్వాసాల వేదత్వమే విశ్వ విజ్ఞానము  || శ్వాసతో || 

Friday, December 23, 2016

ఓ భావమా ఓ తత్వమా

ఓ భావమా ఓ తత్వమా
విశ్వానికే తెలియని మహా భావమా
జగతికే కలగని మహోన్నత తత్వమా
మహా వేదాన్ని తెలిపే వేదాంత విజ్ఞానమా   || ఓ భావమా ||

జగమంతా ఉదయించే సూర్యోదయ సువర్ణ భావమా
విశ్వమంతా ఆవరించే మహోదయ కిరణ తేజత్వమా
బ్రహ్మాండమంతా వెలసిన అంతరిక్ష నిర్మాణ అద్భుతమా
ప్రపంచమంతా ఎదిగిన మహా జీవుల జీవన విధాన విజ్ఞానమా

లోకంలో విరిసిన మహా ప్రకృతి రూపమా
సృష్టిలో పరిచిన సహజ వనరుల ప్రదేశమా  || ఓ భావమా ||

ఏ ప్రభావం లేకుండా చలనం లేని దివ్యత్వమా
ఏ ప్రతాపశక్తితో ధ్వనించే భూగోళ పరిభ్రమణమా
ఏ సంఘటన లేనిదే మార్పు చెందని పరిణామమా
ఏ ఆకారమైన సంపూర్ణంగా కనిపించని రూప దృశ్యమా
ఏ రూపమైన అంతర్భావం చూడని సూక్ష్మ రూపాంతరమా
ఏ జీవమైన స్వాభావిక స్థితిని గమనించలేని పరిశోధనమా  || ఓ భావమా || 

Monday, September 19, 2016

సాయీ! ఒక చెయ్యి వేయుము

సాయీ! ఒక చెయ్యి వేయుము
నాలోని భారాన్ని తగ్గిస్తూ నన్నే మార్చుము  
కర్తగా కర్మగా క్రియగా నేనే దిగ్భ్రాంతితో ఇమిడిపోయి ఉన్నాను
మహా విజయంతో నాలోని అపారమైన ప్రజ్వల శక్తిని పెంచుము || సాయీ! ||

కర్తగా ఏది జరిగినా కర్మగా సాగుతూనే వెంటాడుతున్నది
క్రియా విశేషణము ఎంతటిదైనా గుణమే మారిపోతున్నది

ఆదుకుంటావని మౌనంతో నీ హృదయాన్ని చేరుకుంటున్నా
అలమటిస్తావని నాలోని భావాలనే నీకు తెలుపుకుంటున్నా   || సాయీ! ||

చేసే పనిలో నీ చెయ్యి వేసి సాయంతో నన్నే గట్టెక్కించుము
సాగే కార్యంలో కర్తవ్యాన్ని మేమే సాహసంతో అధిగమించెదము

నాలోని శక్తిని విశ్వానికి విజ్ఞానంగా పరిశుద్ధంగా అందించెదము
నాలోని భక్తిని నీ విశ్వానికి పరిపూర్ణంతో సంపూర్ణంగా ఇచ్చెదము || సాయీ! ||