Thursday, April 4, 2019

ప్రతి జీవిని ప్రశాంతంగా ఉంచెదవా పర జీవమా

ప్రతి జీవిని ప్రశాంతంగా ఉంచెదవా పర జీవమా
ప్రతి జీవిని స్నేహంతో చూసెదవా పర ప్రాణమా

ప్రతి జీవిలో ఉన్నది ఒకే జీవ బంధం
ప్రతి ప్రాణిలో ఉన్నది ఒకే ఆకలి వేదం

ప్రతి జీవి శ్వాసలో తెలియును ఒక గమనం
ప్రతి జీవి వేదనలో తెలియును ఒక నియమం   || ప్రతి జీవిని ||

జీవించే విధములో ఎన్నో మార్గాల ఏంతో సహనం
జీవించే వైనములో ఎన్నో వేదాల ఎంతో వేదాంతం (విజ్ఞానం )

జీవించుట ప్రతి జన్మకు తెలిసిన కాల సిద్ధాంతం
జీవించుట ప్రతి ప్రాణికి తెలిసిన విజ్ఞాన శాస్త్రీయం   || ప్రతి జీవిని ||

జీవించు కాల సమయాన నియమాలను పాఠించుట ఒక శాస్త్ర విజ్ఞానం
జీవించు కాల ప్రమాణమున సిద్ధాంతాలను ఆదరించుట ఒక వేద సారాంశం

జీవించుటలోనే ఎన్నో జీవ వేదాల పురాణాల పరమార్థం
జీవించుటలోనే ఎన్నో జీవ శాస్త్రాల సాంకేతిక నైపుణ్యార్థం   || ప్రతి జీవిని ||

No comments:

Post a Comment