ప్రతి మనిషిలో జీవించెదనా ప్రతి శ్వాసనై
ప్రతి మనిషిలో మరణించెదనా పర శ్వాసనై
ప్రతి జీవిలో ఉదయించెదనా ప్రతి భావమై
ప్రతి జీవిలో అస్తమించెదనా పర తత్వమై
ప్రతి అణువులో ఒదిగిపోయెదనా ప్రతి రూపమై
ప్రతి పరమాణువులో ఎదిగిపోయెదనా పర ఆకృతినై || ప్రతి మనిషిలో ||
ధ్యాసనై ఉన్నా పర ధ్యాసలో పరంధామనై జీవిస్తున్నా
శ్వాసనై ఉన్నా పర శ్వాసలో పరమాత్మనై విహరిస్తున్నా
జీవమై ఉన్నా పర జీవిలో పరిశుద్ధమై పరిశోధిస్తున్నా
ఆత్మనై ఉన్నా పర ఆత్మలో పరిపూర్ణమై పరిశీలిస్తున్నా || ప్రతి మనిషిలో ||
ఆకారమై ఉన్నా పరాకృతిలో పరమాణువునై ఎదుగుతున్నా
భావనమై ఉన్నా పరభాణిలో ప్రతిస్పందనమై ఒదుగుతున్నా
క్షణమై ఉన్నా పర్యవేక్షణలో దక్షణమై వీక్షిస్తున్నా
కాలమై ఉన్నా ప్రకారంలో వర్తమానమై అన్వేషిస్తున్నా || ప్రతి మనిషిలో ||

No comments:
Post a Comment