Monday, June 17, 2019

విశ్వము చేసే ఆలోచనలో ప్రకృతి ప్రక్రియ పరమార్థము తెలిపేను

విశ్వము చేసే ఆలోచనలో ప్రకృతి ప్రక్రియ పరమార్థము తెలిపేను
జగము చేసే యోచనలో జీవతి ప్రక్రియ పరిశోద్దార్థనము తెలిపేను

ప్రకృతి ప్రక్రియ జీవ పదార్థముచే సాగే సూక్ష్మ క్రియ కార్యముల విశ్వ జ్ఞాన పరిశోధనమే
విశ్వతి ప్రక్రియ అణు పరమాణుచే సాగే అర్థ క్రియ కార్యముల వేద విజ్ఞాన పర్యవేక్షణమే  || విశ్వము ||

విశ్వములో రూపాలన్ని కాల ప్రభావముచే ఎదిగిన ప్రకృతి జీవములే
జగములో ఆకారాలన్నీ కాల సమయముచే మారిన ప్రకృతి జీవములే

ప్రకృతి విశ్వతి జగతికి రూపతినిచ్చిన ఆకృతి భావాల ఆవరణమే
జగతి జాగృతి ప్రకృతికి ఆకృతినిచ్చిన జీవతి తత్వాల పరిణామమే  || విశ్వము ||

విశ్వములో అనంతమై ఎదిగిన రూపాలన్నీ అణువుల ఆకారాల అర్థాంశమే
జగములో నిత్యమై ఒదిగిన ఆకారాలన్నీ పరమాణువుల రూపాల దివ్యాంశమే

ప్రకృతి ప్రక్రియ విశ్వ పదార్థముల జీవ పరిణామ పరమార్థమే
విశ్వతి ప్రక్రియ జీవ పదార్థముల జన్యు పర్యావరణ పరమాత్మమే  || విశ్వము ||

No comments:

Post a Comment