Tuesday, August 25, 2015

ఓ వర్ణ మోహపు సుందరీ..

ఓ వర్ణ మోహపు సుందరీ.. నీవు సువర్ణ దేశపు యువరాణివే   
విశ్వ దేశాల సుందరీ..  నీవు అఖండ జగతికే నవనీత తరంగిణివి ||

సువర్ణాలతో పొదిగిన నీ దేహం సుగంధ పరిమళాల సౌందర్యం
నవ వర్ణాలతో ఒదిగిన నీ రూపం సూర్యోదయ కాంతికే సుందరం  ||

నీ ఆకార రూపం మనస్సులో మంత్రమై ధ్యాసలో తంత్రమయ్యేను
నీ నాట్య కళా భావం మేధస్సులో మర్మమై శ్వాసలో స్థిరమయ్యేను  ||

నక్షత్రాల వెలుగులో నడిచి వెళ్ళే ఆకాశ దేశపు మేఘ మాలిని నీవే 
గంధర్వ లోకాన జల సుగంధాల పల్లకిలో ఊరేగే సుధారాణి నీవే    ||

ఊహా చిత్రాలలో ఒదిగిన అనంత దేశాల దివ్యమైన విశ్వ సుందరి నీవేలే
అజంతా ఎల్లోరా శిల్పాలలో అలరించినా అందాల ఆణి ముత్యానివి నీవేలే  ||

జగమున జత కలిసే జాబిలి రాత్రి జగన్మోహన సుందిరి నీవేలే
జగతిలో జలదరించే జన జీవన జాడలో జగదేక సుందరి నీవేలే   ||

నక్షత్రాల దీవిలో నవ మోహన వర్ణ ఛాయలో నిలచిన తారవు నీవేలే
విశ్వపు దీవుల వీధిలో వయ్యారి హంసల అతిలోక సుందరి నీవేలే   ||

అమృత తేనీయపు సెలయేరులో జలకాలాడే జలధారపు నెరజాణవు నీవేలే
శికరపు అంచుల సరస్సులలో సరసాలాడే సరోవర సంయుక్తవు నీవేలే    ||

No comments:

Post a Comment