Thursday, October 13, 2011

ఎక్కడో విశ్వం వేదమై జీవిస్తున్నది

ఎక్కడో విశ్వం వేదమై జీవిస్తున్నది
జీవమే విశ్వమై వేదంలా సాగుతున్నది
జీవించేలా వేదమే జీవితాన్ని సాగిస్తున్నది

ఒక జీవం విశ్వానికే తెలుపుతున్నది - భావనగా జీవం వేద సాగరాన్ని చేరుతున్నది
జీవితం ఏమౌతుందో కాలానికే తెలియని వేదంలా కఠిన భావాలతో సాగిపోతున్నది
ఒక భావన హృదయాన్ని పలికిస్తున్నది - ఆకలికి అమృత భావన ఆవేదనగా మారుతున్నది
జీవించుటలో ఎన్ని నేర్చినా పలికించే హృదయానికే గాయమైతే మనస్సైనా పగిలిపోతుంది
ఒక వేదన నాకై వినిపిస్తున్నది - భవిష్య వాణిగా తెలిసే కాల జ్ఞానమే అనుభవం అన్నది
ఏది తెలిసినా వినిపించే వేదానికి భయం కలిగితే అనుభవం ఉన్నా అనుమానస్పదమే

ఎక్కడో విశ్వం వేదమై జీవిస్తున్నది
జీవమే విశ్వమై వేదంలా సాగుతున్నది
జీవించేలా వేదమే జీవితాన్ని సాగిస్తున్నది

ఒక విజ్ఞాన భావన అంటున్నది - విశ్వ వేదాన్ని తెలిపేందుకు మహాత్ములు లేరు
కాల మార్పులకు సమాధానాలు తెలిసినా అభివృద్ధి సమాజానికి ఉపయోగం లేదే
ఎవరికి వారు ఆర్థికంగా ఎదుగుతున్నారే గాని మహా విశ్వ నిర్మాణం ఎక్కడ లేదే
శాస్త్రవేత్తలున్నా ఆర్థికంగా పనిచేసేవారే గాని సమాజానికి సేవా భావం లేనే లేదు
విశ్వ ప్రణాళికలు మేధస్సులోనే మరణంతో క్షీణించి గాలిలా అంతరించి పోతున్నాయి
మరో గాలి వీచినా విశ్వ నిర్మాణం సాగని ఊహా భావపు విజ్ఞానుల జీవితాలు ఎన్నో

ఎక్కడో విశ్వం వేదమై జీవిస్తున్నది
జీవమే విశ్వమై వేదంలా సాగుతున్నది
జీవించేలా వేదమే జీవితాన్ని సాగిస్తున్నది

No comments:

Post a Comment