కాలమే నిన్ను మార్చగలదు
భావమే నిన్ను మార్చగలదు
కాల భావమే నిన్ను మార్చగలదు ||
కాలానికి నీవెవరో తెలియకున్నా బంధాలు మారిపోతాయి
కాలానికి నీ రూపం తెలియకున్నా భావాలు మారిపోతాయి
ప్రయాణించే మార్గంలోనే మార్పులెన్నో సంభవిస్తాయి
ప్రయాణించే మార్గాలే ఎన్నో మార్పులతో మారిపోతాయి
జన్మించిన కాలమే మరణించే కాలానికి మారిపోతున్నది
మరణంతో మరో జన్మకై కాలమే మరో భావంతో మారుతున్నది
కాలమే నిన్ను మార్చగలదు
భావమే నిన్ను మార్చగలదు
కాల భావమే నిన్ను మార్చగలదు ||
ఎన్నో కార్యాలతో భావాలు మారిపోతూనే ఉన్నాయి
ఎన్నో కార్యాలతో ఎందరో మారిపోతున్నారు
వారికే తెలియని భావాలు వారినే మార్చుతున్నాయి
వారికే తెలియని కార్యాలు వారికై కలుగుతున్నాయి
విజ్ఞానంతో మారిపోతున్నా కాలం తానుగా మారిపోతుంది
అజ్ఞానంతో మారిపోతున్నా భావం తానుగా మారిపోతున్నది
కాలమే నిన్ను మార్చగలదు
భావమే నిన్ను మార్చగలదు
కాల భావమే నిన్ను మార్చగలదు ||
No comments:
Post a Comment