కాలమే నిన్ను మారుస్తున్నా మేధస్సు మారిపోవద్దనే తెలపాలి
విజ్ఞానమే నీలో ఉన్నా అజ్ఞానం నీ వెంట ప్రయాణించరాదు ||
నీవే ఒక మహాత్మవై విశ్వ జగతికి వెలుగును అందించాలి
నీవు చూసే దిక్కులోనే ప్రతి జీవి జీవితాన్ని సాగించాలి
విశ్వానికే మహా భావమై నిలిచే నీ రూపానికే సూర్యోదయం
దైవానికే మహా రూపమై నిలిచిన నీ భావానికే మహోదయం
నీలోనే విశ్వ ఖ్యాతి నీలోనే విశ్వ శక్తి నీలోనే దివ్య స్పూర్తి
నీవే మహా విజ్ఞాన జీవిగా విశ్వానికి విధాతగా జీవిస్తావు
కాలమే నిన్ను మారుస్తున్నా మేధస్సు మారిపోవద్దనే తెలపాలి
విజ్ఞానమే నీలో ఉన్నా అజ్ఞానం నీ వెంట ప్రయాణించరాదు ||
ఏనాటిదో నీ విజ్ఞాన జీవితం జగతికే మహా రూప దర్శనం
ఎందరో జీవిస్తున్నా ఏ విజ్ఞానికి లేదే నీ విశ్వ విచక్షనత్వం
ఏ కారణంచే జన్మించావో విశ్వ కర్మకే తెలియని బంధం
ఏ ఆధారంతో వచ్చావో దైవానికే తెలియని మహా మర్మం
నీలోనే ఓ వేదం నీలోనే ఓ విశ్వం నీలోనే ఓ భాష్పం
నీకై ఎవరు ఉన్నా నీవు జీవించే విధానమే విజ్ఞాన సాఫల్యం
కాలమే నిన్ను మారుస్తున్నా మేధస్సు మారిపోవద్దనే తెలపాలి
విజ్ఞానమే నీలో ఉన్నా అజ్ఞానం నీ వెంట ప్రయాణించరాదు ||
No comments:
Post a Comment