Showing posts with label గమ్యం. Show all posts
Showing posts with label గమ్యం. Show all posts

Tuesday, February 7, 2017

విధిగా జీవించు విధినే అధిరోహించు

విధిగా జీవించు విధినే అధిరోహించు
విధిగా ప్రేమించు విధినే జయించు

నీ విజ్ఞానంతో విధినే తప్పించు
నీ అనుభవంతో విధినే వదిలించు  || విధిగా ||

ఏనాటి విధితత్వ జీవితమో మన కార్యాల శ్రమ సాధన సమస్యలతో సాగే జీవన విధానం
ఏనాటి బహు బంధమో మన భావాలు స్నేహితుల అనురాగాల ప్రేమతో సాగే అనుబంధం

ఎప్పటికీ తెలియని వేదాంత సారాంశం మన జీవితంలో సుఖ దుఃఖాలను కలిగిస్తుంది
ఎప్పటికీ తోచని భావోదయ వేదాంతం మన జీవనంలో బహు బంధాలను చేరుస్తుంది   || విధిగా ||

ఏమిటో కాల ప్రభావం ఎప్పటికో కార్య విరమణం
ఏమిటో జీవ ప్రభావితం ఎప్పటికో వేద విజ్ఞానం

ఏదో అనుభవం ఎక్కడికో గమ్యం సాధనలో ఎరుకే మహా గొప్ప మార్గం
ఏదో కొత్త విజ్ఞానం ఎక్కడికో ప్రయాణం శ్రమలో సాధన మహా ఆయుధం

అనుభవ విజ్ఞానమే శాంతి మార్గాన్ని సాగించే కాల ప్రయాణం
వేద ప్రభావమే విధిని తొలగించే ప్రేమ ప్రశాంత జీవన గమ్యం   || విధిగా || 

Tuesday, August 2, 2016

అటు ఇటు తిరిగే ప్రయాణం ఎక్కడికో

అటు ఇటు తిరిగే ప్రయాణం ఎక్కడికో
ఇటు అటు నిలిచే గమ్యం ఎందులకో ఏమో
ఎక్కడికో తెలియని ప్రయాణం ఎవరికో తెలియని గమ్యం ఎందులకో ఏమో  || అటు ఇటు ||

ప్రయాణంతో సాగే జీవితం గమ్యాన్ని చేరే స్థానం మన జీవన కార్యమేగా
ప్రతి అడుగు ఒక మెట్టుగా ప్రతి సాధన ఒక విజ్ఞాన వేదనగా సాగే వేదికయే

సూర్యునితో సాగే ఉదయం సంధ్య వేళ సూర్యాస్తమయమయ్యే కాల ప్రయాణమే
చీకటిని తొలిచే వెలుగు సూర్యోదయానికి మహోత్తర స్వాగతమయ్యే భ్రమణమే   || అటు ఇటు ||

అన్వేషణగా సాగే విజ్ఞానం అనుభవమయ్యే పరిజ్ఞానం పరిశోధనగా పరిశీలించుటయే
ఆవేదనతో సాగే వేదాంతం అనుబంధాలకు తెలిపే జీవన సూత్రాన్ని భోధించుటయే

కాలంతో కలిగే భ్రమణం మనలో తోచే జ్ఞాపకాల ఆలోచనలు జీవితంలో ఒక ప్రయాణమే
క్షణంతో మొదలయ్యే జీవితం మన ఎదుగుదల ప్రారంభాన్ని చివరిగా సాగించే గమ్యమే || అటు ఇటు || 

Friday, July 29, 2016

ఏది నీ వచనం ఏది నీ గమనం

ఏది నీ వచనం ఏది నీ గమనం
ఆలోచనలోనే ఉన్నది నీ గమకం
ధ్యాసతోనే సాగుతున్నది నీ గమ్యం  || ఏది ||

విజ్ఞానంతో సాగే నీ వచనం గమనమైతే
అనుభవంతో సాగే గమనం గమకమైతే
కాలంతో సాగిపోయే గమ్యం నీకు గళం అగును

ప్రతి సమయం నీకు ఒక నిర్వచనమై
ప్రతి క్షణం నీలో ఓ జ్ఞాపకాల నిరీక్షణమై
ప్రత్యక్ష కాలం నీకు నిర్వేదమగునులే       || ఏది ||

వచనంతో వదనం మహా భాగ్యమైతే
వదనంతో వాలకం గొప్ప తత్వమైతే
విలాపం వలసపోయే దివ్యత్వం వచ్చేనులే

భావాలతో బంధం నీకు సమీపపై
సంబంధాలతో అనురాగం నీతో చేరువై
అనుబంధాలతో ఆప్యాయత నీ చెంత చేరునులే   || ఏది || 

Thursday, June 2, 2016

ఓ బాటసారి... నీవు నడిచే మార్గం నాదే నీవు తెలిపే రహదారి నాదే

ఓ బాటసారి...
నీవు నడిచే మార్గం నాదే
నీవు తెలిపే రహదారి నాదే
నీవు ఎక్కడ నిలిచినా ఏ గమ్యం చేరినా నా ప్రయాణం సాగిపోవునే  || ఓ బాటసారి... ||

విశ్వమంతా నా రహదారి మార్గమే కనిపిస్తున్నది
నీవు ఉన్న చోట నా స్థానమే నీకు సూచిస్తున్నది

ఏ దారి లేని చోట నీవు నడచినా అదే నా రహదారిగా మారేను
ఏ మార్గాన్ని నీవు విడచినా ఆ దారిలోనే నడిచే వారు ఎందరో

ఎడారిలో కనిపించదు నా దారి ఆకాశం చూపదు నా మార్గము
నీటిలో తోచదు నా మార్గం నీకు ఏ దిక్కున ఎలా వెళ్ళిపోవాలో  || ఓ బాటసారి... ||

విజ్ఞానంతో సాగిపోతే దిక్సూచిలా నా మార్గం నీకు తెలిసేను
అనుభవంతో సాగిపోతే మరో మార్గం నా రహదారిలో కలిసేను

జన్మించిన స్థానము నుండి మార్గాన్ని సాగించే మరణ గమ్యాన్ని చేరేవు
ఎందరో సాగించిన ఈ మార్గాలే సృష్టిలో రహదారులుగా సాగి పోయేను

తెలియని మార్గాన్ని అన్వేషిస్తే సూచనలెన్నో తెలిసేను
సూచనలతో మార్గాన్ని సాగిస్తే అనుభవమే నీకు కలిగేను

ఇదే నా ప్రయాణం ఇదే నా మార్గం ఇదే నా దారి రహదారి
ఇదే నా లోకం ఇదే నా రహస్యం ఇంతే నీ ప్రయాణ జీవితం  || ఓ బాటసారి... ||