Showing posts with label నడవడి. Show all posts
Showing posts with label నడవడి. Show all posts

Friday, May 26, 2017

కలలతో కథగా సాగిపోనా ఊహలతో కల్పితమై చిత్రించనా

కలలతో కథగా సాగిపోనా ఊహలతో కల్పితమై చిత్రించనా
భావాలతో బంధానై సాగినా ఆలోచనలతో అనుబంధమై వెళ్ళనా

ఏనాటి కలలు కథలుగా ఏనాడు చెప్పుకున్నా
ఈనాటి ఊహలు చిత్రాలుగా చూసుకున్నాము   || కలలతో ||

కలలన్నీ గతానికే వెళ్ళగా ఊహలు భవిష్యవాణిగా వచ్చునేమో
కలలెన్నో జరగకపోయినా ఊహాలు స్వల్పమై సంభవించునేమో

ఆలోచనల అవధులు ఏవైనా కలలకు కథలకు ఊహలు ఏమైనా చిత్రించునే
భావాల స్వభావాలు ఏమైనా ఆలోచనల నడవడిలో కార్యాలు ఏవైనా జరుగునే   || కలలతో ||

కలలే కథలుగా ఊహలే చిత్రాలుగా విజ్ఞానమే ఎదుగుతున్నదా
ఉపాయమే కార్యాలుగా ఆలోచనలే పరిశోధనగా సాగుతున్నదా

కలైనా కథైనా పరమార్థాన్ని విజ్ఞానంతో పరిశోధించగా అనుభవమే తెలిసేనా
ఊహైనా చిత్రమైనా పరమార్థాన్ని జ్ఞానంతో పరిశీలించగా ఉపాయమే తోచేనా   || కలలతో ||
 

Tuesday, July 26, 2016

సృష్టిలోని సమస్యలను సమీక్షించరా

సృష్టిలోని సమస్యలను సమీక్షించరా
అన్వేషణతో నీ విజ్ఞానాన్ని చాటుకోరా   || సృష్టిలోని ||

నీ సమస్యల పరిష్కార స్వభావాలను కాలంతో నడిపించు
నీ విజ్ఞాన అమిథ్య ఆలోచనలను మేధస్సుతో పరిశీలించు

నీవే విశ్వ విజ్ఞానమై సమస్యలనే తగ్గిస్తూ నవ జీవితాన్ని కలిపించు
నీవే మహా తత్వమై సమస్యలకు శాశ్విత పరిస్కారాన్ని అందించు  || సృష్టిలోని ||

నీ భావాలను ఎందరికో తెలపాలి ఇంకా ఎందరికో తెలియాలి
నీ తత్వాలు ఎందరికో తెలియాలి మరెందరో తెలుసుకోవాలి

జీవన విధానంలోనే నడవడిక సరిలేని ప్రవర్తనగా సాగుతున్నది
జీవిత మార్గంలోనే సహాయం లేక సూచనలేని విధానమౌతున్నది  || సృష్టిలోని || 

Monday, May 23, 2016

ఓ బాటసారి ....

ఓ బాటసారి ....
నీటిలో ప్రయాణమా రహదారిలో ప్రమాదమా
రహదారిలో అడుగు వేస్తే నడవడి మారిపోవునా
నీటిలో అలలు వస్తే నావ తిరగబడి పోవునా  || ఓ బాటసారి .... ||

వర్షం వస్తే రహదారి చిందర వందర అగునా
నదిలో నావ చీటికిమాటికి అటుఇటు తిరుగునా

రహదారిలో దిక్కులు తోచినా అడుగులు వేయలేవా
నీటిలో దిక్కులు తోచకున్నా ఏ దిక్కున సాగి పోలేవా

ఇది జీవన ప్రయాణంతో సాగే జీవిత పోరాటం
ఇది మౌనంతో సాగే హృదయ వేదన సాగరం || ఓ బాటసారి .... ||

అలలతో సాగే నావ ఆగిపోతే అడుగులు వేసే రహదారి తీరం చేరుకోవా
కలలతో సాగే జీవితం కలతతో ఆగితే మరో కొత్త ప్రయాణం చేయలేవా

మారిపోయే కాలంతో మనిషే మారకపోతే ఏ జీవి నిన్ను మార్చునో
ప్రతి జీవిలో ఉన్న పరమార్థమే నీ మేధస్సుకు అనుభవమైనదేమో

సాగించే ప్రయాణం ఏదైనా ఓర్పుతో ధైర్యంగా సాగిపోవాలి
కాలంతో ప్రమాదం అనుకున్నా అజ్ఞానాన్ని వదులుకోవాలి || ఓ బాటసారి .... ||