Showing posts with label కర్తవ్యం. Show all posts
Showing posts with label కర్తవ్యం. Show all posts

Thursday, July 14, 2016

సాహసమే సామర్థ్యమై శ్వాసే విజయం వైపు సాగించునా

సాహసమే సామర్థ్యమై శ్వాసే విజయం వైపు సాగించునా
ఆలోచనే ప్రయత్నమై ధ్యాసే మహా కార్యంతో సాగిపోవునా

సాహసమే ఊపిరిగా కార్యమే ధ్యాసగా విజయమే లక్ష్యమై సాగేనా
ఆలోచనే ధైర్యంగా ప్రయత్నమే ఉత్తేజముగా కర్తవ్యంతో సాగునా  || సాహసమే ||

జీవించుటలో ఎదిగే విజ్ఞానమునకై సాహసం చేసెదెమా
జీవితంలో కలిగే అనుభవానికై సామర్థ్యంతో పోరాడెదమా

భవిష్య కాలంతో సాగేందుకు పరుగులు చేసెదమా
రేపటి కాలంతో నడిచేందుకు ప్రయాణం సాగించెదమా   || సాహసమే ||

జీవం ఉన్నంతవరకకైనా మన విజ్ఞానాన్ని చాటుకుందామా
విశ్వం సహకరించువరకు మన అనుభవాన్ని తెలుపుకుందామా

స్నేహంతో సాగే జీవితాన్ని అందరికి ఇప్పుడే పంచెదమా
సాహసంతో సాగే విజయ రహస్యాన్ని ఎందరికో తెలిపెదమా  || సాహసమే || 

Thursday, May 26, 2016

ఏది నీ ధ్యేయం ఏది నీ లక్ష్యం ఏది నీకు సాధ్యం తెలుసుకో ఓ మిత్రమా

ఏది నీ ధ్యేయం ఏది నీ లక్ష్యం ఏది నీకు సాధ్యం తెలుసుకో ఓ మిత్రమా
తెలిసినది విజ్ఞానం తెలియనిది అనుభవం సాధన చేసుకో ఓ భావమా    || ఏది నీ ధ్యేయం ||

అన్నీ తెలిసి ఉన్నా తెలియనిది మరో కొత్తగా కాలంతో వస్తూనే ఉంటుంది
కాలంతో మారిపోయే అలవాట్లతో వచ్చి పోయేవి ఎన్నో మేధస్సుకే తెలియాలి

విజ్ఞానం సౌందర్యం అలంకారం అనుభవించడం ఇవేనా మన సౌకర్యం
సృష్టించడం సుధీర్గ కాలం శ్రమించడం ఇవేలే మనకు అసలు సిసలు

విజ్ఞానానికి కొదవ లేదు అనుభవానికి తావు లేదు ఎక్కడైనా తెలియని విధమేలే
అందరికి అన్నీ అందక పోయినా అవసరమయ్యేవి అందించాలి ఓ మిత్రమా  || ఏది నీ ధ్యేయం ||

సాధనతో  సాధ్యం చేసుకోవడమే మన కర్తవ్యం
దీక్షతో శ్రమించడమే మన జీవిత పర మార్థం

అన్వేషించడంలోనే ఉన్నది నవ జీవన విజ్ఞానం
నీవుగా ఎదిగి ఎందరికో దారి చూపడమే సంపూర్ణం

నీతో ఉన్నది నలుగురికి చెప్పడమే విజ్ఞాన సోపానం
నీకు మరల కొత్త అనుభవం కలగడమే కాల తత్త్వం

నీ ధ్యేయం ఓ విజ్ఞాన విశ్వ గ్రంథం
నీ లక్ష్యం నవ జీవన విధాన సంపూర్ణత్వం
నీ సాధన ప్రతి క్షణం అనుభవంతో జీవించడం || ఏది నీ ధ్యేయం ||