ఒకటే మాట ఒకటే భావం ఒకటే పదం పలికినదే స్నేహం
ఒకటే శ్వాస ఒకటే ధ్యాస ఒకటే మనస్సు తెలిపెను జీవం
మనలో మనమై మనస్సుతో జీవిస్తే మాటలో మధురమే
మనలో మనమై విజ్ఞానంతో ఎదిగితే మనస్సులో మౌనమే ॥ ఒకటే మాట ॥
మనిషిగా జీవిస్తూనే మనలోని శ్రమ నశించి పోతున్నది
వెల లేని జీవన విధానం విలువలేని శ్రమ వృధా ఐనది
ప్రాణాలు రోగాలుగా మారి రాగాలు అరిగి తరిగి పోతున్నాయి
శ్వాస నిలువలేక పోతున్నా జీవాత్మ స్నేహమై నిలుపుతున్నది
ఎప్పటిదాక ప్రయాణమో శక్తి లేని జీవం ఆరాట పడుతున్నది
గమ్యం లేని రహదారిలో గమనం లేక గానం ఘాటవుతున్నది
మరణమే ధ్యాసగా రోగమే గమ్యమై శ్వాసే చిన్నదవుతున్నది
మనస్సే యాసగా రూపమే వికారిగా శరీరమే కూలిపోతున్నది ॥ ఒకటే మాట ॥
ఆదుకునే భావం లేదు స్నేహమనే అర్థం అసలే లేదు మనలో
ఆశించకున్నా అసమర్థంగా చూసే భావన ఎందుకు మనలో
మనలో మనమే స్వార్థపరులైతే మనిషిగా మనిషికి మనుగడ ఎందుకో
మనిషే మనిషికి సహాయమైతే మనిషిలోని మానవత్వమే మరెందరికో
మనిషిలోని మేధస్సే మహా విజ్ఞానమైతే మనిషిగా మరెందరిలో జ్ఞానమే
మనిషిలోని ఆలోచనే అద్భుతమైతే మనిషిగా మనలో మహా విజయమే
మనిషిగా మనమంతా ఏకమై మహాత్ములుగా ఎదుగుదాం
మనిషిగా మహార్షులై అజ్ఞానాన్ని మరోవైపుగా తరిమేద్దాం ॥ ఒకటే మాట ॥