విశ్వమే పిలిచింది జగతియే తెలిపింది
మనస్సులోని మాట ఈనాడే తెలిసింది
ఏనాటిదో ఈ పిలుపు ఇప్పుడే తోచినది || విశ్వమే పిలిచింది ||
విశ్వానికి నా భావన తెలిసినది
నా భావనతో పిలుపే తెలిపింది
నాతోనే ఉన్న భావన జగతికే అంకితమంది
నాలో ఉన్న వేదన విశ్వానికే మధురమంది
ఏనాటికైనా ఈ జగతి నాతోనే వస్తానంది
ఎప్పటికైనా ఈ విశ్వం నాతోనే జీవిస్తానంది || విశ్వమే పిలిచింది ||
నాలోనే ఉన్న ఎన్నో విశ్వ భావాలు జగతికే తెలపాలి
నాతోనే ఉన్న ఎన్నో స్వభావాలు విశ్వానికే తెలియాలి
ఏనాటిదో ఈ మధురం జన్మతో జగతికి అంకితం
ఏనాటిదో ఈ విజ్ఞానం మరణంతో విశ్వానికి సొంతం
తెలిసినది నా భావన విశ్వానికి ఓ సమయాన
తెలిపినది నా వేదన జగతికి ఓ క్షణ కాలాన || విశ్వమే పిలిచింది ||

No comments:
Post a Comment