Wednesday, September 19, 2018

ఏనాడు మొదలైనదో ప్రశ్న ఇప్పటికి తెలియని విధమై సాగుతున్నది

ఏనాడు మొదలైనదో ప్రశ్న ఇప్పటికి తెలియని విధమై సాగుతున్నది
ఎందుకు మొదలైనదో ప్రశ్న ఎప్పటికి తెలియని తనమై సాగుతున్నది

ప్రశ్నలతోనే సాగే రోజుల జీవితం సమస్యల తీరుగా వెళ్ళే కాలం
ప్రశ్నలతోనే సాగే రోజుల జీవనం విచారాల బారుగా సాగే సమయం  || ఏనాడు ||

విజ్ఞానులైనా సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు
వేదాంతులైనా సమస్యలను చూస్తూనే ఉంటారు

సమస్య కానిదైనను సమస్యగా తెలుపుతూనే ఉంటారు
సమస్య లేకున్నను సమస్యగా మార్చుతూనే ఉంటారు   || ఏనాడు ||

అర్థం లేనిదైనను అలవాటుగా ప్రశ్నలతో సమస్యలుగా మార్చెదరు
అవసరం కానిదైనను మోహంగా ప్రశ్నలతో సమస్యలుగా చూపెదరు

పరిష్కారం తెలిసే వరకు ఆగలేక సమస్యను ప్రశ్నలతో విసిగించెదరు
పరిష్కారం కలిగే వరకు ఓర్వలేక సమస్యను ప్రశ్నలతోనే వేగించెదరు   || ఏనాడు ||

విచారణలో వివరణ లేకుండానే సమస్యను మరో ప్రశ్నలతో ముగించెదరు
విశ్లేషణలో ప్రాధాన్యత లేకుండానే సమస్యను మరో ప్రశ్నలతో పెంచెదరు

అవసరం లేనివారికి అవసరం అన్నట్లు ఎన్నో సమస్యలను కల్పిస్తుంటారు
అవసరం ఉన్నవారికి అవసరం లేనట్లు ఎన్నో సమస్యలను కల్పుతుంటారు   || ఏనాడు ||

జన్మించడమే ప్రశ్నల వలయంగా సాగే సమస్యల రహదారి ప్రయాణం
జీవించడమే ప్రశ్నల ప్రళయంగా మారే సమస్యల పరదారి పరిశోధనం

ఎదురుగా వచ్చే సమస్యల ప్రశ్నలకు ఎరుకగా నిలిచేదే జీవితం
అకస్మాత్తుగా కలిగే సమస్యల ప్రశ్నలకు సాధనగా సహించేదే జీవనం   || ఏనాడు || 

ప్రాణం ఉన్నంతవరకు ఏదైనా కావాలని తెలిపేదే మేధస్సు

ప్రాణం ఉన్నంతవరకు ఏదైనా కావాలని తెలిపేదే మేధస్సు
ఆలోచన ఉన్నంతవరకు ఏ కోరికనైనా కలిగించేదే మనస్సు

మేధస్సులోని ఆలోచన మనస్సులోని కోరిక ఎదిగే వయస్సు
ఆయుస్సులోని వేదన మనస్సులోని మోహన ఒదిగే వయస్సు

కాలమంతా అనంతమైన ఆలోచనలతో సాగే మోహన కోరికల శిరస్సు  || ప్రాణం ||

కోరికల ఆలోచనలతో మనస్సు ఎదుగుతూనే సాగేను వయస్సు
భావాల ఆలోచనలతో వయస్సు ఒదుగుతూనే సాగేను మనస్సు

తత్వాల తపనంతో తన్వయం చేసేదే వలపుల వయస్సు
భావాల తహనంతో తన్మయం చేసేదే మమతల మనస్సు   || ప్రాణం ||

అంతమే లేని ఆలోచనలకు విజయమే లేదు చివరి వరకు అన్నదే తపస్సు
శూన్యమే లేని ఆలోచనలకు విశ్రాంతియే లేదు తుది వరకు అన్నదే తేజస్సు

కాలంతో కలిగే భావాల స్వభావాలను మార్చేను మనలోని వేదాల ఛందస్సు 
సమయంతో వచ్చే తత్వాల తపనాలను దాచేను యదలోని నాదాల సరస్సు   || ప్రాణం ||

ఎప్పటికి చెదరని మనస్సు మోహనాల మననం మేధస్సు 
ఎన్నటికి కుదరని వయస్సు నవ కోరికల గమనం శిరస్సు

అన్వేషణతో సాగే తెలియని వేదాల ఆలోచనల అనంత నాభమే మేధస్సు
సంభాషణతో సాగే తెలుపని జ్ఞానుల ఆలోచనల సర్వాంత చిత్రమే శిరస్సు   || ప్రాణం ||

Saturday, September 15, 2018

శోధన పరిశోధన చేసుకో నీలోనే అన్వేషణ

శోధన పరిశోధన చేసుకో నీలోనే అన్వేషణ
వేదన ఆవేదన సరిచేసుకో నీలోనే ఆలోచన

సంఘటనలతో నీవు విచారమా సమస్యలతో నీవు విషాదమా
వేదాలతో నీవు వేదాంతమా బంధాలతో నీవు అనుబంధమా

సాధనాలతో పరిష్కారాలను ప్రయోజనం చేసుకో మిత్రమా  || శోధన ||

సమాజంతో సంక్షోభమా సంఘటనలతో సంతాపమా
సమస్యలతో సంశయమా సంఘాలతో సంభావనమా 

విఘ్నాలతో వితండమా విషయాలతో విఫలమా
విభేదాలతో విచారణమా విధానాలతో విన్నపమా  || శోధన ||

పరిచయాలతో పరిశోధనమా పరిణామాలతో పరిశుద్ధమా
ప్రశ్నలతో ప్రత్యామ్నాయమా ప్రశంసలతో పర్యావరణమా

స్వభావాలతో సద్భావమా తత్వములతో తాపత్రయమా 
పరిశోధనలతో పరిష్కారమా సిద్ధాంతాలతో ప్రయోజనమా  || శోధన || 

Thursday, September 6, 2018

ఎదిగినా ఒదిగిన రూపమే అమ్మ

ఎదిగినా ఒదిగిన రూపమే అమ్మ
తలచినా కలిగిన రూపమే అమ్మ

మలిచినా వలచిన రూపమే అమ్మ
పలికినా పిలిచిన రూపమే అమ్మ

ఏ రూపమై నిలిచినా తన రూపమే అమ్మ
ఏ భావమై చూసినా తన బంధమే అమ్మ    || ఎదిగినా ||

ఆకాశమై అవతరించిన సూర్యోదయమే అమ్మగా వెలిసిన అమృత తేజం
ఆలయమై ఆవరించిన ఆనందమయమే అమ్మగా తలచిన ఆద్యంత శిల్పం

నీడగా నడిపిస్తూనే వేదాన్ని పలికిస్తూ అన్వేషించే తపనమే అమ్మ ఆచరణం
జాడగా సాగిస్తూనే ధర్మాన్ని బోధిస్తూ వివరించే విజ్ఞానమే అమ్మ ఆకాంక్షణీయం   || ఎదిగినా ||

గమ్యాన్ని చేరుకొనుటకు సహనంతో సాధనం చేసే సాహసమే అమ్మ ఒక శౌర్యం
లక్ష్యాన్ని గ్రహించుటకు మేధస్సుతో ఉపాయం చేసే సామర్థ్యమే అమ్మ ఒక వీర్యం

బంధాలను సాగిస్తూనే రూపాలను సృష్టిస్తూనే నిలిచినది అమ్మ స్వరూపం
కార్యాలను నడిపిస్తూనే రూపాలను కల్పిస్తూనే వెలిసినది అమ్మ సౌభాగ్యం   || ఎదిగినా || 

అమ్మకు అమ్మగా అమ్మమ్మగా జన్మించావు మాతృ దేవతవై

అమ్మకు అమ్మగా అమ్మమ్మగా జన్మించావు మాతృ దేవతవై
అమ్మకు అమ్మమ్మకు అమ్మగా జన్మనిచ్చావు మాతృ దైవమై

అమ్మగా జన్మినిస్తూనే అమ్మమ్మవై జీవిస్తున్నావు మాతృ దేహమై  || అమ్మకు ||

అమ్మ అనే పదం ఆలోచనకు కలిగిన మహా గొప్ప వరం
స్త్రీ అనే భావం మేధస్సుకు తోచిన మహా మధుర వేదం

అమ్మగా ప్రతి జీవికి తోడుగా నిలిచే స్థానమే ప్రేమామృతం
అమ్మగా ప్రతి జీవికి నీడగా నిలిచే స్నేహమే విశ్వామృతం  || అమ్మకు ||

భావంతో వెలిసిన రూపం అమ్మగా బంధంతో ఇమిడిపోయిన మహా ఖనిజం
తత్వంతో కలిగిన ప్రేమం అమ్మగా సిద్ధంతో నిలిచిపోయిన మహా దర్శనం

కాలంతో తరతరాలుగా బంధాలతో యుగయుగాలుగా సాగే అమ్మ మహా సాగరం
సమయంతో సున్నితమై సంధర్భాలలో మెలకువగా సాగే అమ్మ మహా సోపానం  || అమ్మకు ||