ఏనాడు మొదలైనదో ప్రశ్న ఇప్పటికి తెలియని విధమై సాగుతున్నది
ఎందుకు మొదలైనదో ప్రశ్న ఎప్పటికి తెలియని తనమై సాగుతున్నది
ప్రశ్నలతోనే సాగే రోజుల జీవితం సమస్యల తీరుగా వెళ్ళే కాలం
ప్రశ్నలతోనే సాగే రోజుల జీవనం విచారాల బారుగా సాగే సమయం || ఏనాడు ||
విజ్ఞానులైనా సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు
వేదాంతులైనా సమస్యలను చూస్తూనే ఉంటారు
సమస్య కానిదైనను సమస్యగా తెలుపుతూనే ఉంటారు
సమస్య లేకున్నను సమస్యగా మార్చుతూనే ఉంటారు || ఏనాడు ||
అర్థం లేనిదైనను అలవాటుగా ప్రశ్నలతో సమస్యలుగా మార్చెదరు
అవసరం కానిదైనను మోహంగా ప్రశ్నలతో సమస్యలుగా చూపెదరు
పరిష్కారం తెలిసే వరకు ఆగలేక సమస్యను ప్రశ్నలతో విసిగించెదరు
పరిష్కారం కలిగే వరకు ఓర్వలేక సమస్యను ప్రశ్నలతోనే వేగించెదరు || ఏనాడు ||
విచారణలో వివరణ లేకుండానే సమస్యను మరో ప్రశ్నలతో ముగించెదరు
విశ్లేషణలో ప్రాధాన్యత లేకుండానే సమస్యను మరో ప్రశ్నలతో పెంచెదరు
అవసరం లేనివారికి అవసరం అన్నట్లు ఎన్నో సమస్యలను కల్పిస్తుంటారు
అవసరం ఉన్నవారికి అవసరం లేనట్లు ఎన్నో సమస్యలను కల్పుతుంటారు || ఏనాడు ||
జన్మించడమే ప్రశ్నల వలయంగా సాగే సమస్యల రహదారి ప్రయాణం
జీవించడమే ప్రశ్నల ప్రళయంగా మారే సమస్యల పరదారి పరిశోధనం
ఎదురుగా వచ్చే సమస్యల ప్రశ్నలకు ఎరుకగా నిలిచేదే జీవితం
అకస్మాత్తుగా కలిగే సమస్యల ప్రశ్నలకు సాధనగా సహించేదే జీవనం || ఏనాడు ||

No comments:
Post a Comment