Thursday, October 18, 2018

నా దేహములోనే అనంత జీవములు జీవిస్తున్నాయి

నా దేహములోనే అనంత జీవములు జీవిస్తున్నాయి
నా మేధస్సులోనే సర్వాంత జీవములు ఉదయిస్తున్నాయి

నా రూపములోనే సకల జీవరాసులు నిర్మితమైనాయి
నా ఆకారములోనే సకల జీవరాసులు నిర్ణీతమైనాయి   || నా దేహములోనే ||

జీవములన్నీ ఒకటేనని దేహములోనే జీవమై జీవిస్తున్నాయి
దేహములన్నీ ఒకటేనని మేధస్సులోనే జ్ఞానమై ఉదయిస్తున్నాయి

రూపాల ఆకారాలలోనే అనంత భావాలు నిర్మితమై ఉన్నాయి
సుగంధాల వర్ణాలలోనే సర్వాంతర తత్వాలు నిర్ణీతమై ఉన్నాయి  || నా దేహములోనే ||

ఆత్మ పరమాత్మలోనే పరిశోధన ప్రభావాలు పరిశీలనమై ఉన్నాయి
జ్యోతి పరంజ్యోతిలోనే పరిపూర్ణ ప్రాకారాలు పరిశుద్ధనమై ఉన్నాయి

జ్ఞాన విజ్ఞానములోనే ప్రజ్ఞాన ప్రబంధకాలు పరిజ్ఞానమై ఉన్నాయి
శాస్త్ర సిద్ధాంతములోనే శాస్త్రీయ పరిష్కారాలు సృస్టీకరణమై ఉన్నాయి  || నా దేహములోనే || 

No comments:

Post a Comment