Thursday, April 28, 2016

అరే ఏమైందీ..! ఒక మనిషికి ఈ క్షణమే భావన కలిగింది

అరే ఏమైందీ..! ఒక మనిషికి ఈ క్షణమే భావన కలిగింది
అరే ఏమైందీ..! ఒక మనిషికి ఈనాడే హృదయం వెలిసింది || అరే ఏమైందీ..! ||

మనిషిగానే జన్మించావని హృదయ భావన నీలో వెలిసింది
మనిషిగానే జీవిస్తున్నావని సమయ స్పూర్తి నీలో కలిగింది

హృదయంలోనే దాచుకున్న ప్రేమలో ఎన్ని భాదలు దాగున్నాయో
ప్రతి హృదయంలో ఎన్ని భావాలు బాధలుగానే మిగిలి పోయాయో

సూర్యుడిలా ఉదయించే నీకు సంధ్య వేళ ప్రేమ భావం ఎందుకో
ఆకాశంలా కనిపించే నీకు ప్రతి రాత్రి వేళ చీకటి రూపం ఎందుకో || అరే ఏమైందీ..! ||

హృదయంలో దాగిన రూపం మేధస్సులోనే జీవించే స్వప్నం
ఆలోచనలో ఎదిగిన భావం హృదయంలోనే నిలిచేను ఆకారం

మనస్సులోన మిగిలిన మాట స్వరములోనే మౌనమాయే
మేధస్సులోన కలిగిన భావం ఆలోచనలోనే ఉండిపోయే

అర్థాన్ని గ్రహించే విజ్ఞానం పరమార్ధంతో పరమాత్మలోనే నిలిచేనే
భావాన్ని తెలిపే వేదం స్వభావంతోనే విశ్వ జగతిలోన నిలిచేనే || అరే ఏమైందీ..! ||

Monday, April 25, 2016

మళ్ళీ మళ్ళీ రాని భావన మళ్ళీ మళ్ళీ రాని ఆలోచన

మళ్ళీ మళ్ళీ రాని భావన మళ్ళీ మళ్ళీ రాని ఆలోచన
మళ్ళీ కలగాలని మళ్ళీ తోచాలని మళ్ళీ చూడాలని
మనలో కలిగే భావం మనలో దాగిన ఆలోచన నేడు వచ్చేనే || మళ్ళీ మళ్ళీ ||

మనస్సు మెచ్చిన భావనే మళ్ళీ కలగాలని మన ఆలోచన
హృదయం తలచిన ఆలోచనే మళ్ళీ రావాలని మన భావన

వసంతాలతో వచ్చే ఋతువులు వందనాలు పలికే పక్షులు
వచ్చి పోయే కాల భావ ఆలోచనలు వాతావరణ ప్రభావాలే  || మళ్ళీ మళ్ళీ ||

కాలంతో సాగే జీవరాసులు ఎన్నో ప్రతి క్షణం ఎదిగే జీవులు ఎన్నో
జనన మరణ ప్రమాణాలు ఎన్నో ప్రతి సమయం కారణాలు ఎన్నో

ఎవరు ఎవరిని మళ్ళీ చూసేదెవరో మళ్ళీ మళ్ళీ కలిసేదెవరో
ఎవరు ఎవరిని మళ్ళీ తలచేదెవరో మళ్ళీ మళ్ళీ కలిపేదెవరో  || మళ్ళీ మళ్ళీ || 

Tuesday, April 19, 2016

నాలో నీ శ్వాసే నీలో నా ధ్యాసే ఇక నీవు నేను మరో జన్మలోనే

నాలో నీ శ్వాసే నీలో నా ధ్యాసే ఇక నీవు నేను మరో జన్మలోనే
వినిపిస్తున్నది నీలోని స్వరమే కనిపిస్తున్నది నాలోని రాగమే
మోహంతో సాగే జీవితం మరణిస్తున్నది జన్మనే చాలిస్తున్నది || నాలో నీ శ్వాసే ||

దేహంలో దైవము దహించిపోయినది శరీరములో శ్వాసకు సందేహమైనది
మేధస్సులో భావన నిలిచిపోతున్నది జీవంలో ఆత్మ శూన్యమైపోతున్నది

ఆలోచనగా లేని రూపం కళ్ళకు తెలియకున్నది
ఊహాగా లేని స్వప్నం మేధస్సుకు కనుమరుగైనది

నాలో ఉన్న నీ వెలుగు ప్రతి క్షణం చీకటై పోతున్నది
నీలో ఉన్న నా కాంతి ప్రతి నిమిషం కనిపించకున్నది || నాలో నీ శ్వాసే ||

నాలో తెలియని అన్వేషణ ఎందుకు మొదలైనదో
అన్వేషణలో సాగే ఆలోచన తెలియకనే ఏమైనదో

జీవించాలని ఉన్నా జీర్ణించుకోలేని జీవం వెళ్లి పోతానన్నది
ఉండాలని ఉన్నా ఆలోచించుకోలేని మేధస్సు ఆగి పోతానన్నది

హృదయములో చలనానికి ఏ భావన లేదన్నది
శరీరములో ఏ అవయవానికి ఏ స్పర్శ లేదన్నది || నాలో నీ శ్వాసే ||

ఈ ప్రేమకు ఏమైనదో ప్రేమించలేని భావనతో ఎటో వెళ్ళిపోతున్నది

ఈ ప్రేమకు ఏమైనదో ప్రేమించలేని భావనతో ఎటో వెళ్ళిపోతున్నది
ఈ బంధానికి ఏమైనదో కలుసుకోవాలనే అనుబంధం ఏది లేదన్నది || ఈ ప్రేమకు ||

ఏ రూపం ఎవరికో తెలియని జతగా కలుసుకొంటున్నది
ఎవరు ఎవరికి బంధమో ఎక్కడికి వెళ్ళినా తెలుస్తున్నది

కాలంతో సాగేందుకైనా ఒకరితో ఒకరు ఎలాగైనా జీవించాలి
ఒకరితో ఒకరు ఉండాలనే అను బంధాలు అందరికి కలగాలి

ఏనాటిదో ఈ రూపం ఏనాటి వరకో ఈ బంధం జీవితానికే తెలియాలి
ఎవరు ఎంతవరకు ఎవరితో జీవిస్తారో ఈనాటి కాలానికే తెలిసిపోవాలి || ఈ ప్రేమకు ||

ఏడు అడుగులు వేస్తున్నా సప్త సముద్రాలతో నడవాలనే ఈ జీవితం
ఎవరితో ఉంటున్నా ఎవరికొరకో ప్రయాణించాలనే ఈనాటి ఈ జీవనం

మన కోసమే మనవాళ్ళు జీవిస్తూనే అనురాగాన్ని అందించేరు
మన కోసమే మనవాళ్ళు గౌరవిస్తూ అనుబంధాన్ని ఉంచెదరు

ప్రేమిస్తూనే ద్వేషాలు కలిగినా కలిసిపోయేలా భావాలతో జీవించాలి
ఎవరు ఎవరికి బంధమే అను బంధాలతోనే జీవితాలను సాగించాలి || ఈ ప్రేమకు ||

Tuesday, April 12, 2016

ఊపిరితో ఉన్నావా ఊహలతో జీవిస్తున్నావా

ఊపిరితో ఉన్నావా ఊహలతో జీవిస్తున్నావా
శ్వాసతో ఉంటూనే ఊహలలో తేలిపోయావా
హృదయంలో దాగి ఉంటూనే మేధస్సులో ఆలోచిస్తూ ఉన్నావా || ఊపిరితో ||

ఊపిరి నాదైతే జీవం విశ్వానిదే కదా
ఊపిరి నా దేహానికైతే శ్వాస ఆత్మకే కదా

నిరంతరం ఉచ్చ్వాస నిచ్చ్వాస లతో సాగే శరీరం అలసిపోతున్నది
నిరంతరం శ్వాసతో ఆడే హృదయం అనారోగ్యంతో అలసిసొలసినది

వృద్ద్యాపంలో జీవ శ్వాస శరీరాన్ని కవలిస్తున్నది
మరణంతో ఊపిరి దేహాన్ని వదిలించుకుంటున్నది || ఊపిరితో ||

యోగం ధ్యానం చేసినా ఊపిరి సాగేందుకే ప్రయత్నం చేస్తున్నది
భోగం భాగ్యం ఉన్నా ఊపిరి సాగుతూనే ఏదేదో ఆలోచిస్తున్నది

కాలంతో స్నేహం చేసినా దేహాన్ని సాగించే శక్తి ఊపిరికే లేదన్నది
విశ్వంతో బంధం చేసినా ప్రకృతిలో నిలిచే సామర్థ్యం శ్వాసకే లేదన్నది

ఊహలతో సాగే ఊపిరిగా జగతిలోనే నిలిచి పోవాలని
శ్వాసతో ఆగే ఊపిరిగా ఊహకే మరణం లేదని సాగేనని  || ఊపిరితో ||

Thursday, April 7, 2016

ఊపిరివై నీవు నీలోనే జీవిస్తున్నావు

ఊపిరివై నీవు నీలోనే జీవిస్తున్నావు
శ్వాసగా నీవు నీలోనే ఉంటున్నావు
ఉచ్చ్వాస నిచ్చ్వాసలతో శ్వాసగా ఊపిరివైనావు || ఊపిరి ||

ఎదిగే జీవమై శ్వాసలో నిలయమై దేహాన్ని నిలిపావు
ఒదిగే స్వరమై ఉచ్చ్వాస నిచ్చ్వాసలతో ప్రాణమైనావు

నీ శ్వాసతో హృదయమే శరీరానికి చలనాన్ని కలిగించేను
నీ ఆయువుతో మేధస్సే ఆలోచనకు భావాన్ని వెలికించేను
 
గాలిగా నీవు జీవిస్తున్నా దేహంలో ఎన్నో కార్యాలను కొనసాగిస్తున్నావు
శ్వాసగా నీవు ప్రయాణిస్తున్నా ఎన్నో కార్యాలతో జీవితాన్ని సాగిస్తున్నావు || ఊపిరి ||

నీవు ఉంటేనే జీవులకు ఆయుస్సు జీవితాలకు ప్రయోజనము
నీవు ఆడుతుంటే జీవులకు ఊరట హృదయానికి ప్రతిస్పందన  

ఊపిరి ఉన్నంతవరకే జీవనం మేధస్సుతో సాగిపోయేను
శ్వాస ఆడెంతవరకే జీవితం కార్యాలతో జరిగిపోయేను

ఊపిరిలోనే జీవం శ్వాసలోనే ఆత్మ బంధం శరీరానికే సొంతం
దేహంలోనే ఆత్మ శ్వాసపైనే ధ్యాస ధ్యానంతోనే ఊపిరి ఉత్తేజం || ఊపిరి ||

Wednesday, April 6, 2016

నువ్వే నేనని నాలో నీవేనని

నువ్వే నేనని నాలో నీవేనని
నేనే నీవని నీలో నేనున్నానని
నీకై నేనే నీవై నాలోనే నీవున్నావని
నాకై నీవే నేనై నీలోనే నేనున్నాని || నువ్వే ||

నేనుగా నాలో నేనే లేనని నీవే ఉన్నావని
నీలో నీవై నీవుగా లేవని నేనే ఉన్నానని
నేనే నీవై పోయానని నీలోనే ఉంటున్నానని
నీవే నేనై పోయానని నాలోనే ఉంటున్నావని
నీలోనే నేను నాలోనే నీవు కలిసే ఉన్నామని
నీతోనే నేను నాతోనే నీవు మనలో మనమే ఉంటున్నామని || నువ్వే ||

నీవే నేనుగా నాలోన నీవే ఉన్నావని
నేనే నీవుగా నీలోనే నేనే ఉన్నానని
నీవే నాలో లేవని నేనే నీలో ఉంటున్నానని
నేనే నీలో లేనని నీవే నాలో ఉంటున్నావని
నీతో నేను నీవుగా ఉండాలని నేనే నీవై యదలో ఉన్నానని
నాతో నీవు నేనుగా ఉండాలని నీవే నేనై మదిలో ఉంటున్నావని || నువ్వే || 

Tuesday, April 5, 2016

ఎవరు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్లి పోతారు మీరు .....

ఎవరు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడికి వెళ్లి పోతారు మీరు .....
ఏ నగరంలో ఉంటారు ఏ ఊరు వెళ్తారు ఎప్పుడు వస్తారు మీరు .....

ఏనాటి దాకో తెలియని ప్రపంచమే నాది ఎవరికో తెలియని ఆలోచన నాది
రూపంలోనే ఏదో తెలియనిది ఉంది ఆకారంలో ఏదో ఒకటి దాగే ఉంటుంది
భావంతోనే జీవిస్తున్నా కాలంతోనే నడిచి ప్రయాణమే చేస్తున్నా
బంధంతోనే సాగుతున్నా కలిసిన వారితోనే కాలాక్షేపం చేస్తున్నా ॥ ఎవరు ||

తెలియనిది తెలిసేదాక తెలియనిది ఎంతో ఉందని అనుకుంటున్నా
తెలిసినది మరచిపోయే దాక మరో ఆలోచన లేదని భావిస్తున్నా
ఎవరికి ఎవరో తెలియని వారితో జీవితం ఎలాగైనా సాగుతుంది
ఎవరికి ఎవరో తెలిసినా జీవితం ఎప్పటికైనా ఒంటరి అవుతుంది ॥ ఎవరు ||