నాలో నీ శ్వాసే నీలో నా ధ్యాసే ఇక నీవు నేను మరో జన్మలోనే
వినిపిస్తున్నది నీలోని స్వరమే కనిపిస్తున్నది నాలోని రాగమే
మోహంతో సాగే జీవితం మరణిస్తున్నది జన్మనే చాలిస్తున్నది || నాలో నీ శ్వాసే ||
దేహంలో దైవము దహించిపోయినది శరీరములో శ్వాసకు సందేహమైనది
మేధస్సులో భావన నిలిచిపోతున్నది జీవంలో ఆత్మ శూన్యమైపోతున్నది
ఆలోచనగా లేని రూపం కళ్ళకు తెలియకున్నది
ఊహాగా లేని స్వప్నం మేధస్సుకు కనుమరుగైనది
నాలో ఉన్న నీ వెలుగు ప్రతి క్షణం చీకటై పోతున్నది
నీలో ఉన్న నా కాంతి ప్రతి నిమిషం కనిపించకున్నది || నాలో నీ శ్వాసే ||
నాలో తెలియని అన్వేషణ ఎందుకు మొదలైనదో
అన్వేషణలో సాగే ఆలోచన తెలియకనే ఏమైనదో
జీవించాలని ఉన్నా జీర్ణించుకోలేని జీవం వెళ్లి పోతానన్నది
ఉండాలని ఉన్నా ఆలోచించుకోలేని మేధస్సు ఆగి పోతానన్నది
హృదయములో చలనానికి ఏ భావన లేదన్నది
శరీరములో ఏ అవయవానికి ఏ స్పర్శ లేదన్నది || నాలో నీ శ్వాసే ||

No comments:
Post a Comment