Monday, July 10, 2017

తేజమా భావమా నీవే నా రూపమా

తేజమా భావమా నీవే నా రూపమా
దైవమా తత్వమా నీవే నా దేహమా

వర్ణమా బంధమా నీవే నా స్వప్నమా
ధ్యానమా గానమా నీవే నా సంగీతమా   || తేజమా ||

జీవమై ప్రాణమై కలలకే స్నేహమై నిలిచావులే నా మేధస్సులో
వేదమై భావమై మాటలకే ప్రేమమై గెలిచావులే నా మనస్సులో

మౌనంతో మురిసినా మోహమై వాల్చినా అద్భుతమే నీ రూపం
దేహంతో మలిచినా మర్మమై దాల్చినా ఆశ్యర్యమే నీ స్వభావం   || తేజమా ||

రూపాలన్నీ స్వభావాలుగా సాగిన కార్యాలే జీవితాలుగా ఎదిగెనే
భావాలన్నీ తత్వాలుగా కొన సాగిన కార్యాలే వేదాలుగా ఒదిగెనే

జ్ణానంతో సాగే విజ్ఞానం వివిధ దశలుగా పరిశోధన కలిగించెనే
జననంతో సాగే మరణం వివిధ రకాలుగా పరిచయం చేసెనే    || తేజమా || 

No comments:

Post a Comment