ఏనాటిదో గోదావరి ... ఎక్కడిదో ఈ జల ప్రవాహ నది
ఎక్కడి నుండి ఎక్కడికో ఈ ప్రవాహ ప్రయాణ జలధారి
గోవర్ధన గిరి నడుమ వస్తూ ముందుకే సాగేను గంగాధర జల దారి || ఏనాటిదో ||
అడగాలని అడుగులు వేసినా
పలకాలని పరుగులు తీసినా
మాట్లాడాలని మరలు పంపినా
వెళ్ళాలని వంకలు తిరిగినా
తాకాలని తలుపులు చేరినా
నిలవాలని నడకలు ఆపినా
పుష్కరాలకై పుణ్య భావాలతో పరుగులే తీస్తున్నది || ఏనాటిదో ||
అందాలని అలలు ఎగిరినా
కదలాలని కెరటాలు సాగించినా
దాటాలని దిక్కులు చూసినా
గడవాలని గాలులు వీచినా
చేరాలని చెఱువులు దాటినా
వదలాలని ఒడ్డులు తెంపినా
శతాబ్దాలుగా పవిత్ర భావాలతో ప్రవహిస్తూ వస్తున్నది || ఏనాటిదో ||

No comments:
Post a Comment