ఓ దేవా! ఏనాటి ఆత్మతో ఉదయిస్తున్నావు
ఓ దేవా! ఏనాటి స్వరూపంతో జన్మిస్తున్నావు
యోధుడై ఉదయించిన నీవు ఏనాడైనా మరణించెదవు
అమరుడై జన్మించిన నీవు ఎప్పటికైనా అస్తమించెదవు
కాలంతో ప్రయాణించే నీ ప్రతి రూపం యుగాలకు సాగని అనిత్య దేహం || ఓ దేవా! ||
జీవితమే ఒక వేదం అది అందని అనుభవ విజ్ఞానం
జీవనమే ఒక బంధం అది చెదరని అనురాగ భావనం
జరిగినవన్నీ తలచని భావాల తలుపులకు తోరణాలు
జరిగేవన్నీ తపించని తత్వాల ఆలోచనలకు ఆనవాలు
మహాత్ముడై ఎదిగినా మహర్షివై ఒదిగినా కాలమే గమనం || ఓ దేవా! ||
ఎంతటి సాధన ఎంతటి ఆపేక్షణ అది అందని ఒక స్థానం
ఎంతటి వేదన ఎంతటి తాపత్రణ అది చెదరని ఒక కథనం
జీవిత కాలంలో కలిగేవన్నీ కర్పూర కాంతులు
జీవన సమయంలో వచ్చేవన్నీ మెరిసే మెరుపులు
ధీరుడవై ఎదిగినా వీరుడవై ఒదిగినా సమయమే మననం || ఓ దేవా! ||

No comments:
Post a Comment