ఏ శ్వాసతో ఉన్నావని తలిచెదను నిన్ను
ఏ ధ్యాసతో ఉన్నావని పలికించెదను నిన్ను
ఏ భావంతో ఉంటావని తపించెదను నిన్ను
ఏ తత్వంతో ఉంటావని స్మరించెదను నిన్ను || ఏ శ్వాసతో ||
ఏ శ్వాస ధ్యాసతో ఉన్నా నా దేహంలో నీ ప్రాణమే
ఏ భావ తత్వంతో ఉన్నా నా రూపంలో నీ జీవమే
ఏ బంధమైన నాలో నీ స్వరూపం సంతోషమే
ఏ ప్రదేశమైన నాలో నీ స్వదేహం సౌభాగ్యమే || ఏ శ్వాసతో ||
ఏ శ్వాస నిన్ను పలికించినా నా రూపం నీలో వేదమే
ఏ ధ్యాస నిన్ను మళ్ళించినా నా దేహం నీలో దైవమే
ఏ భావం నిన్ను దర్శించినా నా జీవం నీలో స్పందనమే
ఏ తత్వం నిన్ను ధరించినా నా మౌనం నీలో మోహనమే || ఏ శ్వాసతో ||

No comments:
Post a Comment