Friday, December 30, 2011

విశ్వాన్ని మార్చలేవురా నీ జీవితాన్ని

విశ్వాన్ని మార్చలేవురా నీ జీవితాన్ని మార్చుకోలేవురా
నాలోని విశ్వ గీతాన్ని ఆరాధిస్తేనే లోకాలు మారిపోతాయి .....!

నా విశ్వ గీతంలో విశ్వానికి మలినం లేదు ఏ మేధస్సుకు అజ్ఞానం ఉండదు
స్వర్గానికి సమస్యలున్నా నా విశ్వానికి సమస్యలు బహు దూరపు శూన్యమే

విశ్వాన్ని మార్చే ప్రపంచ ప్రణాళికలు నా మేధస్సులోనే నిర్మితమై ఉన్నాయి
విశ్వ నిర్మాణ కార్యాలకు మహా తర్క శాస్త్రములు నా విజ్ఞానంలోనే ఉన్నాయి

ప్రతి జీవి మహా మహారాజులా జీవించే అవకాశం నా విశ్వ గీతంలోనే ఉంది
ప్రతి కార్యం విజ్ఞాన నేత్రంతో సాగేలా లిఖిత పూర్వకంగా రచించ బడి ఉంది

విశ్వాన్ని మార్చలేవురా నీ జీవితాన్ని మార్చుకోలేవురా
నాలోని విశ్వ గీతాన్ని ఆరాధిస్తేనే లోకాలు మారిపోతాయి .....!

ఎన్నో యుగాలుగా ఎదురు చూశాను ఏ నాయకుడు విశ్వాన్ని మార్చలేదు
ప్రతి నాయకుడు తన కోసమే జీవిస్తున్నాడని తన సిద్ధాంతం తెలుపుతున్నది

ధ్యానించే శివుని మేధస్సు కన్నా గొప్పగా విశ్వ విజ్ఞానం నీలో ఉన్నది
ప్రపంచాన్ని మార్చే విశ్వ నిర్మాణ ప్రణాళికకై నీవు శివుడిలా ధ్యానించు

అనుమానం ఉన్నంతవరకు విజ్ఞానం శూన్యమై మేధస్సు శోకంతో సాగుతుంది
మలినం ఉన్నంతవరకు విశ్వంలో జీవిస్తున్న జీవితాలన్నీ వృధాయే మిత్రమా

విశ్వాన్ని మార్చలేవురా నీ జీవితాన్ని మార్చుకోలేవురా
నాలోని విశ్వ గీతాన్ని ఆరాధిస్తేనే లోకాలు మారిపోతాయి .....!

Friday, December 23, 2011

జీవితాన్ని మార్చుకోవా జీవనాన్ని

జీవితాన్ని మార్చుకోవా జీవనాన్ని మార్చలేవా
జీవించుటకు ధనమే మూలమని తెలుసుకోవా ...!

చాలని జీతం జీవితానికి సరిపోదు
హోదా లేని జీవనాన్ని ఓర్చుకోలేరు

ఎదుటి వారిలా విలాసవంతమే కావాలి
ఆశకు హద్దులు లేని ఆలోచనలే ఉన్నాయి

కష్టానికి నష్టానికి నీవే బాధ్యుడవు
సుఖ సంతోషాలకు నీవు సరిపోవు

జీవితాన్ని మార్చుకోవా జీవనాన్ని మార్చలేవా
జీవించుటకు ధనమే మూలమని తెలుసుకోవా ...!

భవిష్య జీవితానికై అధిక ధనం కావాలంటారు
అందరిలా గొప్ప హోదాను కోరుకుంటారు

జీవించే కాలం మెరిసే నగలతో సాగిపోవాలి
ఆశించే కాలం మన చేతిలోనే ఉండిపోవాలి

సమస్యకు ధనమే ఆధారమని జీవిస్తున్నారు
సుఖానికి ధనమే మూలమని అనుకున్నారు

జీవితాన్ని మార్చుకోవా జీవనాన్ని మార్చలేవా
జీవించుటకు ధనమే మూలమని తెలుసుకోవా ...!

Thursday, December 8, 2011

ఎదుట నీవు లేని జీవితానికి అద్దం

ఎదుట నీవు లేని జీవితానికి అద్దం ఎందుకో
హృదయం ఉంటే చాలు జీవించవచ్చని మనస్సే తెలుపుతున్నది
జీవితానికి తోడుగా నీవే జ్ఞాపకంగా అద్దంలా హృదయంలో ఉన్నావు .....

ఆలోచనతో ఊహించే నీ రూపానికి మనస్సే అద్దమై కనిపిస్తున్నది
హృదయంలోనే నీ ప్రతి బింభం చెరగని ప్రతి రూపమై జీవిస్తున్నది

నా మాట కూడా నీ రూపాన్ని స్మరిస్తూ నీపై ధ్యాసతో పలికిస్తున్నది
నీ మాట కూడా నీ రూపాన్ని కనిపించేలా హృదయాన్ని చేరుతున్నది

జ్ఞాపకమే బంధమై జీవితాన్ని నీ రూపంతో సాగిస్తున్నది
హృదయమే జీవితమై నీ మనస్సుతో ఏకీభవిస్తున్నది

ఎదుట నీవు లేని జీవితానికి అద్దం ఎందుకో
హృదయం ఉంటే చాలు జీవించవచ్చని మనస్సే తెలుపుతున్నది
జీవితానికి తోడుగా నీవే జ్ఞాపకంగా అద్దంలా హృదయంలో ఉన్నావు .....

నీ కోసమే జీవిస్తున్నాని నా మేధస్సులో నీకై అన్వేషణ సాగుతున్నది
నీ రూపమే హృదయానికి అద్దమై కనిపిస్తూ నిన్ను చూసుకుంటున్నది

మౌనం కూడా నీ మనస్సులా నన్ను కరిగిస్తూ నిన్ను ప్రేమిస్తున్నది
భావం కూడా నీ హృదయంలా నన్ను పలకరిస్తూ నిన్ను కలవరిస్తున్నది

ఏనాటికైనా నీ రూపం నాలో సగ భాగమై ఉంటుంది
ఏ జన్మకైనా నీ దేహంలో నా రూపం సంపూర్ణమై ఉంటుంది

ఎదుట నీవు లేని జీవితానికి అద్దం ఎందుకో
హృదయం ఉంటే చాలు జీవించవచ్చని మనస్సే తెలుపుతున్నది
జీవితానికి తోడుగా నీవే జ్ఞాపకంగా అద్దంలా హృదయంలో ఉన్నావు .....

Wednesday, December 7, 2011

విశ్వానికి తెలుసు నా భవిష్య భావన

విశ్వానికి తెలుసు నా భవిష్య భావన
జీవించుటలో నా జీవితం నాలాగే సాగాలని.....
మళ్ళీ తలచిన నా భావన నా కోసమే కలిగేలా
నేను జీవిస్తున్నా నా భావాలతోనే నేను మెచ్చేలా.....

ఏనాటికైనా నా భావాలు నాతో జీవించే వారి కోసమే
ఏ భావన ఐనా ఆకాశంలా నాతో కలిసి పోయేందుకే

భావనతో జీవించే నా హృదయం నాకు తోడుగా నిలిచేవారికే
నాలో ఉన్న నా భావాలు తన హృదయానందపు జీవితానికే

మనస్సుతో ఆకర్షించే భావాలకు నా నీడ కూడా తోడుగా ఉంటుందని
మనస్సుతో పలికే మాటలకు నేను తన కోసమే జీవిస్తున్నానని

విశ్వానికి తెలుసు నా భవిష్య భావన
జీవించుటలో నా జీవితం నాలాగే సాగాలని.....
మళ్ళీ తలచిన నా భావన నా కోసమే కలిగేలా
నేను జీవిస్తున్నా నా భావాలతోనే నేను మెచ్చేలా.....

జీవించే ప్రతి క్షణం విడిపోని భావనగా మనస్సులోనే తోడుగా
ప్రయాణించే ప్రతి క్షణం తన కోసమే జీవిస్తున్నా జ్ఞాపకంగా

కలసిపోయే భావాలతోనే సాగిపోయేలా జీవిస్తాం
వెలిగిపోయే ఆశలతోనే కరిగిపోతూ మరణిస్తాం

కాలమే మాకు స్పూర్తిగా విశ్వమే విజ్ఞాన క్షేత్రముగా
భావనయే మాకు జీవంగా సృష్టియే ప్రధాన బంధముగా

విశ్వానికి తెలుసు నా భవిష్య భావన
జీవించుటలో నా జీవితం నాలాగే సాగాలని.....
మళ్ళీ తలచిన నా భావన నా కోసమే కలిగేలా
నేను జీవిస్తున్నా నా భావాలతోనే నేను మెచ్చేలా.....