Friday, December 30, 2011

విశ్వాన్ని మార్చలేవురా నీ జీవితాన్ని

విశ్వాన్ని మార్చలేవురా నీ జీవితాన్ని మార్చుకోలేవురా
నాలోని విశ్వ గీతాన్ని ఆరాధిస్తేనే లోకాలు మారిపోతాయి .....!

నా విశ్వ గీతంలో విశ్వానికి మలినం లేదు ఏ మేధస్సుకు అజ్ఞానం ఉండదు
స్వర్గానికి సమస్యలున్నా నా విశ్వానికి సమస్యలు బహు దూరపు శూన్యమే

విశ్వాన్ని మార్చే ప్రపంచ ప్రణాళికలు నా మేధస్సులోనే నిర్మితమై ఉన్నాయి
విశ్వ నిర్మాణ కార్యాలకు మహా తర్క శాస్త్రములు నా విజ్ఞానంలోనే ఉన్నాయి

ప్రతి జీవి మహా మహారాజులా జీవించే అవకాశం నా విశ్వ గీతంలోనే ఉంది
ప్రతి కార్యం విజ్ఞాన నేత్రంతో సాగేలా లిఖిత పూర్వకంగా రచించ బడి ఉంది

విశ్వాన్ని మార్చలేవురా నీ జీవితాన్ని మార్చుకోలేవురా
నాలోని విశ్వ గీతాన్ని ఆరాధిస్తేనే లోకాలు మారిపోతాయి .....!

ఎన్నో యుగాలుగా ఎదురు చూశాను ఏ నాయకుడు విశ్వాన్ని మార్చలేదు
ప్రతి నాయకుడు తన కోసమే జీవిస్తున్నాడని తన సిద్ధాంతం తెలుపుతున్నది

ధ్యానించే శివుని మేధస్సు కన్నా గొప్పగా విశ్వ విజ్ఞానం నీలో ఉన్నది
ప్రపంచాన్ని మార్చే విశ్వ నిర్మాణ ప్రణాళికకై నీవు శివుడిలా ధ్యానించు

అనుమానం ఉన్నంతవరకు విజ్ఞానం శూన్యమై మేధస్సు శోకంతో సాగుతుంది
మలినం ఉన్నంతవరకు విశ్వంలో జీవిస్తున్న జీవితాలన్నీ వృధాయే మిత్రమా

విశ్వాన్ని మార్చలేవురా నీ జీవితాన్ని మార్చుకోలేవురా
నాలోని విశ్వ గీతాన్ని ఆరాధిస్తేనే లోకాలు మారిపోతాయి .....!

No comments:

Post a Comment