Showing posts with label ఆరంజ్యోతి. Show all posts
Showing posts with label ఆరంజ్యోతి. Show all posts

Wednesday, December 7, 2016

ఆత్మవు నీవే జ్యోతివి నీవే

ఆత్మవు నీవే జ్యోతివి నీవే
పరంజ్యోతివి నీవే పరకాంతవు నీవే
పరమాత్మవైనా మంగళ జ్యోతివి నీవే    || ఆత్మవు ||

విశ్వ జ్యోతివై వెలుగును ఇచ్చే సూర్య కాంతివి నీవే
మహా జ్యోతివై వెలుగును ఇచ్చే తేజస్సు కాంతివి నీవే
మంగళ జ్యోతివై వెలుగును ఇచ్చే ప్రజ్వల కాంతివి నీవే

అఖండ జ్యోతివై జగతికి దారిని చూపే మహా కాంతివి నీవే
ధర్మ జ్యోతివై జీవులకు విజ్ఞానాన్ని పంచే వేద కాంతివి నీవే
వర్ణ జ్యోతివై రూపాలకు ఆకారాన్ని ధరించే సువర్ణ కాంతివి నీవే   || ఆత్మవు ||

జ్యోతిగా వెలిగే ఆత్మ కాంతివి నీవే
పరంజ్యోతిగా వెలిగే సూర్య కాంతివి నీవే
ఆరంజ్యోతిగా వెలిగే మకర కాంతివి నీవే

విశ్వానికే ప్రకాశమై ఆకాశానికే తేజమై జగతికే రూపమై వెలిగే సర్వాంతర జ్యోతివి నీవే
దేహానికి దైవమై శ్వాసకే ధ్యానమై మనస్సుకే మోహమై జీవించే నిత్యాంతర జ్యోతివి నీవే
లోకానికే భావమై సృష్టికే తత్వమై మేధస్సుకే బంధమై తపించే సత్యాంతర జ్యోతివి నీవే  || ఆత్మవు ||

Monday, October 24, 2016

అంతర్జ్యోతినై పరంజ్యోతిగా ఆరంజ్యోతిని నేనే

అంతర్జ్యోతినై పరంజ్యోతిగా ఆరంజ్యోతిని నేనే
పరంధామనై పరమాత్మగా పరంపర ధాతను నేనే
మహాత్మనై మహర్షిగా అంతర్భావ మాధవుడను నేనే  || అంతర్జ్యోతినై ||

మీలో కలిగే భావాలకు నేనే స్ఫూర్తిగా నిలిచివున్నాను
మీలో నిలిచే తత్వాలకు నేనే స్తంభించి పోతున్నాను
మీలో మిగిలే స్వభావాలకు నేనే స్థిరపడి ఉంటున్నాను

ఏ భావమైన మహాత్ములకు మహా తత్వమే
ఏ తత్వమైన మహర్షులకు మహా తీతత్వమే
ఏ వేదమైన మాధవులకు మహా తత్వేత్తమే    || అంతర్జ్యోతినై ||

విశ్వమంతా వెలుగునిచ్చే ఆరంజ్యోతిగా సూర్యోదయమౌతున్నా
జగమంతా విజ్ఞానాన్నిచ్చే పరంజ్యోతిగా అంతర్భావమౌతున్నా
లోకమంతా పరిశోధించే అంతర్జ్యోతిగా నేనే అవధూతమౌతున్నా

ఆత్మ స్వరూపమై ప్రతి జీవిలో నేనే ఉదయించనా
దైవ స్వరూపమై ప్రతి అణువులో నేనే జీవించనా
వేద స్వరూపమై ప్రతి దేహంలో నేనే శ్వాసించనా
నాద స్వరూపమై ప్రతి ప్రదేశంలో నేనే ధ్వనించనా  || అంతర్జ్యోతినై ||