Showing posts with label ఆలింగనం. Show all posts
Showing posts with label ఆలింగనం. Show all posts

Thursday, August 11, 2016

కళ్యాణ వైభోగమే శుభవేళ శోభనమే సుముహూర్తపు సంయోగమే

కళ్యాణ వైభోగమే శుభవేళ శోభనమే సుముహూర్తపు సంయోగమే
మంగళ ఉత్సాహమే శతమానం భవతి కళ్యాణమస్తు శ్రీ శుభమస్తు
శ్రీకారం స్వీకారం శ్రీరస్తు శుభమస్తు మమకారం మనోహరం కళ్యాణమస్తు  || కళ్యాణ ||

సర్వం మంగళం సూత్రం సర్వేంద్రీయ ద్విగుణ మనస్సుల గమనాంతర జీవితం
నిత్యం దంపతుల ఆలింగనం సంయుక్త సంయోగ సంగమల ఉత్పన్నేతర జీవనం

అంతర్భావాలతో సాగే నవ జీవన సంగమం నవీన భావాల సంయోగం
అంతరాత్మలతో సాగే నవ జీవన చరితం నూతన బంధాల సంపర్కం  || కళ్యాణ ||

లగ్నం నవ జీవన మంగళ సూత్రం నవ దంపతులు నడిచే మార్గం
వేదం నవ జీవిత మధుర గాత్రం భవ దేహపు బంధాల సంబంధం

శుభ గడియతో సాగే వివాహం శుభోదయ జీవితమై నవ జీవనం ప్రారంభం
మంగళ ముహూర్తంతో సాగే పెళ్లి నవోదయ బంధమై అభినయంతో ఆరంభం  || కళ్యాణ ||