Showing posts with label ఎక్కడ. Show all posts
Showing posts with label ఎక్కడ. Show all posts

Wednesday, July 19, 2017

ఎవరో నీవు ఎవరో నాకు తెలియాలి

ఎవరో నీవు ఎవరో నాకు తెలియాలి
ఎవరో నీవు ఎవరో నాకు తెలపాలి
ఎవరో నీవు ఎవరో నాకు తోచాలి

ఎవరికి ఎవరో నాకు ఎవరో నీవే కావాలి
ఎవరికి ఎవరో నీకు ఎవరో నేనే కావాలి    || ఎవరో ||

ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నా ధ్యాస నువ్వే అవ్వాలి
ఎక్కడ ఉన్నా ఎలా ఉంటున్నా నీ శ్వాస నేనే అవ్వాలి

ఎక్కడ ఏదో జరుగుతున్నా నీవు క్షేమంగా ఉండాలి
ఎక్కడ ఏదో తరుగుతున్న నీవు ధీరంగా ఉండాలి   || ఎవరో ||

ఎక్కడ ఎవరెవరు ఉన్నా మనమే ఉన్నామని జీవించాలి
ఎక్కడ ఎవరెవరు లేకున్నా మనమే ఉండాలని నివసించాలి

ఎవరికి ఎవరు లేకున్నా మనమే అండగా నిలవాలి అందరితో కలవాలి
ఎవరికి ఎవరు ఉన్నా మనమే నీడగా సాగిపోవాలి అందరితో తోడవ్వాలి   || ఎవరో ||
-- -- -- --
ఎవరో మీరు ఎవరో మాకు తెలియాలి
ఎవరో మీరు ఎవరో మాకు తెలపాలి
ఎవరో మీరు ఎవరో మాకు తోచాలి

ఎవరికి ఎవరో మాకు ఎవరో మీరే కావాలి
ఎవరికి ఎవరో మీకు ఎవరో మేమే కావాలి    || ఎవరో ||

ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మా ధ్యాస మీరే అవ్వాలి
ఎక్కడ ఉన్నా ఎలా ఉంటున్నా మీ శ్వాస మేమే అవ్వాలి

ఎక్కడ ఏదో జరుగుతున్నా మీరు క్షేమంగా ఉండాలి
ఎక్కడ ఏదో తరుగుతున్న మీరు ధీరంగా ఉండాలి   || ఎవరో ||
-- -- -- -- 

Friday, July 22, 2016

ఎవరికి ఎవరు ఉదయించారో ఎవరికి తెలిసేను

ఎవరికి ఎవరు ఉదయించారో ఎవరికి తెలిసేను
ఎవరికి ఎవరు ఏమవుతారో ఎవరికి ఎవరు తెలిపేను
ఎవరికి ఎవరు ఎంతవరకో ఎవరికి తెలియును          || ఎవరికి ఎవరు ||

ఎవరెవరు ఎక్కడ ఉదయిస్తున్నారో ఎవరికి గమనం
ఎవరెవరు ఎవరికి బంధమవుతారో ఎవరికి చలనం
ఎవరెవరు ఎప్పుడు మరణించెదరో ఎవరికి తరుణం

ఎవరికి ఎవరో తెలియని బంధాల తీరు దూరమైపోయేనే
ఎవరికి ఎవరు ఎక్కడో తెలియని బంధాల తీరుగా మారేనే
ఎవరికి ఎవరు ఎప్పుడు ఎలాగ కలిసెదరో జగమే తెలిపేను   || ఎవరికి ఎవరు ||

ఎవరికి ఎవరు ఏమౌతారో జ్ఞాపకాల విజ్ఞానానికి ఆయుస్సుగా తెలుసు
ఎవరికి ఎవరు జతగా జీవించెదరో స్నేహంలా కల్యాణంతో కలిపెదరు
ఎవరికి ఎవరు విడిపోతారో దూరపు భావాలతో అస్తమించి పోయేదరు

ఎవరికి ఎవరు ఉన్నా స్నేహంతో జీవిస్తూ సహాయంతో సంతోషించు
ఎవరికి ఎవరు లేకున్నా మహాత్మ తత్వంతో జీవితాన్ని ఎందరికో కల్పించు
ఎవరికి ఎవరు తెలియకున్నా నీకు నీవుగా జగతికి నిలయమై స్నేహాన్ని సృష్టించు || ఎవరికి ఎవరు ||