Showing posts with label గుణ. Show all posts
Showing posts with label గుణ. Show all posts

Thursday, September 8, 2016

ప్రణామం ప్రణామం ప్రణామం ప్రేమతో జగతికి ప్రణామం

ప్రణామం ప్రణామం ప్రణామం ప్రేమతో జగతికి ప్రణామం
ప్రమేయం ప్రమేయం ప్రమేయం ప్రేమతో విశ్వానికి ప్రమేయం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రేమతో ప్రతి జీవికి ప్రమోదం || ప్రణామం ||

ప్రేమను పంచేందుకే ప్రతి రూపాన్ని ఇచ్చారు
ప్రేమను చూపేందుకే ప్రతి భావాన్ని నింపారు
ప్రేమను ఇచ్చేందుకే ప్రతి బంధాన్ని కలిపారు
ప్రేమను కలిపేందుకు ప్రతి ధర్మాన్ని తెలిపారు

ప్రేమతో జీవించేందుకు జగమంతా స్వేచ్ఛను చాటారు || ప్రణామం ||

ప్రేమించే తత్వమే ప్రకృతిలో మొలిచింది
ప్రేమించే స్వభావమే ప్రకృతిలో వెలిసింది
ప్రేమించే విధానమే పకృతిలో నిలిచింది
ప్రేమించే ధర్మమే ప్రకృతిలో నాటుకుంది

ప్రేమించే గుణగణాలే ప్రకృతిని రక్షించే స్వభావ తత్వాలు || ప్రణామం ||