Showing posts with label దీక్షణ. Show all posts
Showing posts with label దీక్షణ. Show all posts

Wednesday, July 19, 2017

నీలోనే మహాత్ములు విజ్ఞానముకై ఉదయిస్తున్నారు

నీలోనే మహాత్ములు విజ్ఞానముకై ఉదయిస్తున్నారు
నీతోనే మహనీయులు వేదాంతముకై వెలుగుతున్నారు

నీవెంటే మహర్షులు ప్రజ్ఞానముకై జీవిస్తున్నారు
నీవెంటే సాధువులు పరిశోధనకై అన్వేషిస్తున్నారు
నీవెంటే ప్రవక్తలు పర్యవేక్షణకై పరితపిస్తున్నారు    || నీలోనే ||

అఖండమైన సాధనతో విజయం నీదైతే ఎవరైనా అభినందిస్తుంటారు
అమోఘమైన దీక్షణతో విజయం నీదైతే ఎందరైనా అభిమానిస్తుంటారు

అమరమైన వేదాంతం అమృతమై మహాత్మగా నీలోనే ఉదయిస్తుంది
అపారమైన విజ్ఞానం అనుభవమై పరమాత్మగా నీతోనే వెలుగుతుంది  
అంతర్భావమైన ప్రజ్ఞానం అనిర్వచనమై ఆత్మగా నీలోనే జీవిస్తుంది    || నీలోనే ||

ఆకాశం అద్వితీయమైతే ఎవరైనా విజ్ఞానంతో జీవిస్తుంటారు
ఆనందం అపురూపమైతే ఎందరైనా అనుభవంతో వస్తుంటారు

అఖిలమైన ప్రేమం పరతత్వంతో మనతోనే ప్రజ్వలిస్తుంది
అచలమైన  స్నేహం పరభావంతో మనలోనే పరిశోధిస్తుంది
అనంతమైన  హితం పరధ్యాసతో మనతోనే ప్రయాణిస్తుంది    || నీలోనే ||