Showing posts with label దీవెన. Show all posts
Showing posts with label దీవెన. Show all posts

Monday, April 17, 2017

ఎవరివో నీవు ఎక్కడి వాడివో నీవు

ఎవరివో నీవు ఎక్కడి వాడివో నీవు
ఎంతటి వాడివో నీవు ఏనాటి వాడివో నీవు
ఎలా ఉన్నావో నీవు ఎక్కడ ఉన్నావో నీవు
ఎవరైనా నిన్ను చూశారో ఏనాడైనా నిన్ను తలచారో
ఎవరికి తెలియని రూపాన్ని ఎలా తెలుసుకుంటారో   || ఎవరివో ||

ఎవరివో నీవు ఎవరివో ఏనాటి వాడివో నీవు
ఎక్కడ ఉన్నావో నీవు ఎలా ఉంటావో నీవు
నిన్నే చూడాలని నిన్నే చూస్తూన్నదే భావన
నిన్నే కలవాలని నిన్నే తలస్తున్నదే తత్వన   || ఎవరివో ||

ఎవరివో నీవు ఎవరివో ఎక్కడ వాడివో నీవు
ఎవరికి ఎలా తోచెదవో ఎవరికి ఎలా ఉంటావో
నిన్నే మరవాలని నిన్నే తపిస్తున్నదే వేదన
నిన్నే వదలాలని నిన్నే మరిపిస్తున్నది దీవెన   || ఎవరివో || 

Monday, January 16, 2017

శంకర శివ శంకర ఈశ్వర పరమేశ్వర శంభో శివ శుభంకర

శంకర శివ శంకర ఈశ్వర పరమేశ్వర శంభో శివ శుభంకర
నీకై నేనే నిత్యం జీవించనా నాకై నీవే దీవెనగా ఆశీర్వదించవా
కాలంతో సాగుతూ విశ్వంతో ప్రయాణిస్తూ నీతోనే నేను నడిచెదనూ  || శంకర ||

దేవత్వం నీవే హరా దైవత్వం నీవే శుభంకరా అద్వైత్వం నీవే శివ శంకరా
మహాతత్వం నీవే హరా మహత్యం నీవే శుభంకర మహోత్తరం నీవే శంకరా

సత్యం శివ శంకరా నిత్యం శివ శుభంకరా
భావం నీవే శంకరా బంధం నీవే శుభంకరా
సర్వం నీవే శంకరా స్వరం నీవే శుభంకరా
దేహం శివ శంకరా దైవం శివ శుభంకరా     || శంకర ||

పరమాత్మం నీవే హరా మహాత్మం నీవే శుభంకరా సర్వాత్మం నీవే శివ శంకరా
పరిశుద్ధం నీవే హరా పరిపూర్ణం నీవే శుభంకరా మహా పవిత్రం నీవే శివ శంకరా

జీవం శివ శంకరా నాదం శివ శుభంకరా
వేదం నీవే శంకరా ధర్మం నీవే శుభంకరా
నేస్తం నీవే శంకరా ప్రేమం నీవే శుభంకరా
ఓంకారం శివ శంకరా శుభకరం శివ శుభంకరా    || శంకర ||